పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

75

ఏడప అధ్యాయము


హా లెండు స్వాతంత్ర
పోరాటము,

ఈయన పాలనలోనున్న హాలెండు దేశములో ప్రొట స్టెంటుమతము కడు శీఘ్రముగా వ్యాపి చెను. దాదాపుగా ప్రజ లందరును ప్రొటెస్టెంటు మతము నవలంబించిరి. ఈయనకుమారుడగు 'రెండవ ఫిలిప్పు రోమనుకాథలిక్కు మతస్థుడై హాలెండు లోని ప్రొటెస్టెంటు మతమును మిగుల క్రూరమగు పద్ధతులుచే నిర్మూలము చేయుటకు యత్నించెను. ఆయన విధించిన కారాగృహశిక్షలకు మరణ శిక్షలకు మితి లేదు. హాలెండు ప్రజలు మత స్వేచ్ఛకుసు దేశస్వాతంత్యమునకును 1572 వ సంవత్సరమున విలియం ఆఫ్ ఆరెంజ్అను ధీరుని నాయకత్వము క్రింద 'స్పెయిన్ రాజు పై తిరుగు బాటు చేసిరి. ఈ స్వాతంత్ర్య కలహములు పదిసంవత్సరములుజరిగెను. ప్రథమభాగములో ప్రతి చోటను స్పెయిను వారేగెలుచుచు వచ్చిరి. వారి నోడించిన ప్రొస్టెంసెంటు ప్రజలపైచూపిన క్రౌర్యమునకు మేర లేదు. నాలుకులు పీకించియు, కండ్లు పొణిచియు, చర్మము నొలిచియు, మంటలలో పడ వైచియు ఇంక సనేక విధములగు వర్ణనాతీత ములగు చిత్రవధ వధలను చేసిరి.. హాలెండు ప్రజల నాయకుడు విలియం ఆఫ్ ఆరెంజి యొక్క ప్రాణమును తీసినవారికి గొప్ప బహుమాన మిత్తునని స్పెయిసు రాజు ప్రకటించెను. ఆయనను చంపుట కనేక ప్రయత్నములు జరిగి తుదకు 1581 వ సంవత్సరమున నొకడు తాను ప్రొటస్టెంటునని నమ్మించి ఆయన దరిజేరి, ఆయనను