ప్రెంచిస్వాతంత్ర్య విజయము
వీరి యుభయుల మధ్యను అనేక యుద్ధములు జరిగెను. "ప్రేమా స్వరూపుడును సాత్వికమూర్తి lయగు ఏసుక్రీస్తు పేర యూరపు ఖండములో మానవరక్తము వెల్లువలుగా పారెసు.
స్పెయిన్ దేశము స్వాతంత్ర్యము
స్పైన్ దేశము మహ:మహమ్మ దీయులగు మూరుజాతి వారిచే జయింపబడి పాలింపబడుట చూచియున్నాము. ఈ మహమ్మదీ య రాజులు దేశములో శాంతిని నెలకొలిపి తమ పాలనిలోని క్రైస్తవ ప్రజలకు మత స్వేచ్ఛ నొసంగి కళలను, విద్యలను, ప్రకృతి శాస్త్రములను వృద్ధి చేసి గొప్పనాగరికతను స్థాపించిరి. కాని స్పెయిన్ దేశములోని క్రస్త వులు మతావేశము చేతను, దేశాభిమానము చేతను విదేశీయులు ను, ఇతర మతస్థులును నగు మహమ్మదీయులను స్పెయిన్ నుండి వెళ్లగొట్టుటకు ప్రయత్నించిరి. 732 వ సంవత్సరము మొదలు 1492 వ సంవత్సరము వఱకును క్రైస్తవులకును మహమ్మదీ యులకును పోరాటములు జరిగి క్రమముగా దేశము క్రైస్తవుల పశ మయ్యెను. 1402 వ సంవత్సరము లో జరిగిన యుద్ధములో ముసల్మానులు . పూర్తిగనోడిపోయి స్పెయిన్ దేశమునుండి వెడల గొట్టబడిరి. స్పెయిన్ దేశమున కంతకును ఇజబెల్లా రాణి యయ్యను . ఈమె మనుమడగు అయిదవ చార్లెసు రాజు ఆస్ట్రీ యాకు చక్రవర్తియై యూరపుఖండమున ప్రథానుడగు రాజుగ నుండెను.