పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ ఆధ్యాయము

3

జర్మనీలోని శాక్సనీ రాష్ట్రాధిపతి
యొక్క రక్షణార్థము దాగుకొనెను.

ఇంతటి నుండియు క్రైస్తవమతములో రెండు శాఖ లేర్ప డెను. పాత దానికి రోమన్ కాథలిక్కు మతమనియు, నూతన సంస్కరణమునకు ప్రొటస్టెంటు ముత మనియు బేరువ చ్చెను. 1542 వ సంవత్సరమున చార్లెసు రాజు స్పెయిన్ దేశములో ప్రారంభమున ఇన్ క్విజిషన్" అని మతవిచారణ శాఖ నేర్ప రచెను. ఇట్టి మతవిచారణ శాఖలు పోపు యొక్క యుత్తర్వుల ప్రకారము రోమను కాథలిక్కు దేశములన్నిటిలో స్థాపించబ డెను. ప్రొటెస్టెంటులను విచారణ చేసి ఖండించి యెఱ్ఱగా కాలిన యినుప స్తంభమునకు కట్టి వేసిగాని, మంటలో పడ వేసిగాని, శిర చ్ఛేదము జేసిగాని చంపుచుండిరి. అనేకులు తమ మనస్సాక్షి కొఱకై యిట్టి ఘోరమరణములను పొందుటకు సిద్ధపడిరి. ప్రొటస్తెంటు మతము వ్యాపించిన కొలదియు ప్రొటస్టెంటులగు రాజులుకూడ తమ దేశములలోని రోమను కాథలిక్కులగు ప్రజలను ఘోరశిక్షలకే పొలుచేసిరి. "ఈశ్వరుని నారాధిం చుటకు అనేక మార్గము లున్నవి. ఎవరిబుద్ధికి బాగుగయున్న మార్గమున వారారాధించవచ్చును,” అను ధర్మమును యూ రఫుఖండ వాసులు చిరకాలము పఱకును గ్రహించ లేదు. 'దేశము లోని మతగురువుల యొక్కయు రాజు యొక్కయు మతము గాక ఇతర మతము నవలంబించిన వారికి మరణశిక్ష విధించుచు వచ్చిరి. రోమసు కాథలిక్కులు ప్రొటస్టెంటులను, ప్రొటెస్టెం టులు రోమను కాథలిక్కులను మతము పేరిట చంపుకొనిరి.