పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
64

ప్రెంచి స్వాతంత్ర్యవిజయము

యెంచబడినట్టియు, "సువర్ణమయ " మైనట్టియు, "రత్నగర్భ" ఆయినట్టియు, "వరహాల వృక్షములు" కలిగినట్టియు హిందూ దేశముతో వర్తకము చేసికొనుట గొప్ప మదృష్టమని యూర' పునాను భావించిరి. హిందూదేశము యొక్క చెప్పనలవిగాని యైశ్వర్యయు యూరపియ జతుల నాకర్షించినది, ఎటులైన హిందూ దేశమునకు నూతనమైన తోవలు కనుగొనవ లేనని యూర పుజాతులవారు గొప్ప ప్రయత్నములను చేసిరి. హిందూ దేశమును దరిద్రస్థితి నుండి బాగు చేయుటకుగాని, అనాగరిక స్థితినండి యుద్ధరించుటకుగాని ఈదేశ మునకు యూరపుఖండవాసులు రాలేదు. తేమకన్న ఎక్కువ నాగరికతను చెంది . మిగుల భాగ్యవంతముగనున్న యీ దేశముతో వ్యాపారము చేసికొని, తాము బాగుపడి, తమ దేశములకు సొమ్ము తీసికొ నిపోవుటకయియే యూరపియను ( తెల్లవార) లిచటికి విచ్చే సిరి. ఇప్పుడు హిందూదేశము లోకములో కెల్ల దరిద్ర వంతమై నదై క్షామ దేవతకు శాశ్వతనివాసమైనది. పరిశ్రమలన్నియు నశించినవి. కళలు రూపుమాసినవి. పౌరుషము పూజ్యమైనది . ప్రకృతి శాస్త్రములు మంటగలిసినవి. విజ్ఞానము అడుగంటినది. హిందూ దేశీయులు ప్రపంచములో ప్రతిచోటను నీచముగ చూడబడుచున్నారు. హిందూ దేశము యొక్క "ఐశ్వర్యము,” “రత్నములు, " "సువర్ణము," వరహాలు" విదేశీయుల పాలైనవి.