పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
63

ఆఱవ ఆధ్యాయము

వేయుటకును నూతనజీవమును కలుగ జేసిరి. వీరిలో ముఖ్యులు మెకల్ యేంజిలో, రాఫేల్ లు.

(3)

హిందూ దేశమునకు
త్రోవలయత్నము

అదివర కనేక శతాబ్దముల నుండియు యూరఫు ఖండము నకు ఆసియూఖండము తో వర్తకము సాగుచుండెను. హిందూ దేశములో, చైనా దేశములో తయారుచేయబడిన దూది, ఉన్ని, పట్టు వస్త్రములును,నితర పారిశ్రామిక సరుకులును యూరపు ఖండములోని వివిధ దేశములకు నెగుమతి యగుచుండెను. ఆసియూ మైనరు, ఈ కోల్డు బాల్కన్ రాష్ట్రములు, గ్రీసుదేశముల గుండ నీసరు కులు యూరపునకు రవాణా యగుచుండెను. తురుష్కు లీప్రదే శముల నన్నిటిని స్వాధీనమును పొందినత ర్వాత క్రైస్తవులగు యూరపు దేశములవారికి తమ శత్రువులగు ముసల్మాను రాజ్యముగూడ వ్యాపారము సాగించుట దుర్భరమయ్యెను. తురుష్క సుల్తానుగారి యనుగ్రహమ పొందుట కష్టతర మయ్యేను. కావున ఆసియాఖండములోని తూర్పు ప్రాంతము నకు, ముఖ్యముగా హిందూ దేశమునకు సముద్రములమీద ప్రయాణము చేయుటకు తోవలు కని పెట్టుట , యూరపు లోని వివిధ దేశములవారును యత్నములు సలిపిరి. ఆకాల మున హిందూ దేశము వ్యవసాయమునకును, పరిశ్రమలకును, కళలకును, శాస్త్రములకును, వర్తక వ్యాపారములకును, నాగరి కతకును ప్రసిద్ధి చెంది మిగుల నైశ్వర్యవంతమైనదై లోకము లో కెల్ల సగ్రస్థానము వహించియున్నది. “భూతల స్వర్గ"మని