పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
62

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

గ్రీకుగ్రంధ రాజములతో కూడ వెళ్లి పాఠశాలలను స్థాపించిరి. కళాశాలలలో కొంద రాచార్యత్వమును వహించిరి, యూరపు ఖండములోని చాల దేశములలో ప్రాచీన గ్రీకుల యొక్క విజ్ఞాన ముసు పఠించసాగిరి. క్రీస్తు పుట్టక పూర్వము గ్రీసు దేశములో ప్రాచీన హిందూ దేశము లోవలె, స్వతంత్ర మైన భావములలో నిండిన వాజ్మయము, నాగరికత, ప్రకృతి శాస్త్రములు ప్రబలి యుండెను, క్రస్తవమతము వచ్చినతర్వాత మతగురువుల ప్రాబల్య మధిక మై స్వతంత్ర భాపములను నిర్మూలింప జేసిరి. ప్రకృతిశాస్త్రములు సైతానుయొక్క విద్యయని క్రైస్తవమత గురువులు నిరుత్సాహపరచిరి. గొప్ప ప్రకృతి శాస్త్రజ్ఞులను మతగురువులు కారాగృహములలో పడ వేయించిరి. మతగురు వుల ఆధిక్యతకింద మధ్య మయుగములో యూరపుఖండము మూఢ మైన నమ్మికలలోను, అంధ కారములోను మునిగియుండె ను. పదు నేనవ శతాబ్దములో ప్రాచీన గ్రీకుల నాగరికత, విజ్ఞాన ము వ్యాపించిన కొలదీయు యూరఫుఖండమునకు మానసిక వికా సము కలిగెను. మూఢవిశ్వాసములు కొంతవరకు తొలగ నారంభించెను. హేతువాదన, యథార్థమును కనుగొనవలెనను సంకల్పము కలిగెను. మత స్వేచ్ఛను, క్రైస్తవమతములో సం స్కరణమును కొందరు వాంఛించిరి. ప్రకృతి శాస్త్ర శోధనలు ప్రారంభమయ్యెను. స్వాతం త్రాంకురములు మొలకలెత్తసా గెను. పదు నేనవ శతాబ్దమున నిటలీ దేశమున సుప్రసిద్ధులగు చిత్రలేఖకులు బయలు దేరి కళలకును, చిత్తరువులకును, రంగులు