పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

61

ఆఱవ అధ్యాయము

కాన్ స్టాంటినోపిలును కాన్ స్టాంటైను అను చక్రవర్తి పాలించు చుండెను. తురుష్కులు లక్ష యేబది వేలమంది సైనికులతో ముట్టడి సలిపిరి, కాస్ స్టాంటైను చక్రవర్తియొద్ద పది వేలకన్న సైన్యము లేదు. ముసల్మానులు ఫిరంగులతో గోడలను పడ గొట్టి పట్టణములో ప్రవేశించిరి. మే 29 వ తేదిన యుద్ధములో కాన్ స్టాంటైను చక్రవర్తి మరణించెను. కాస్ స్టాంటినోపిలు తురుష్కులవశ మయ్యెను. అచటి 'సెంటుసోఫియా యను క్రైస్తవ దేవాలయము స్వాదీనము చేసి కొని దానిలో ముస స్మాసులు మహమ్మదీయ మత ప్రకారము ప్రార్థనలు సలిపిరి.

2

యూరపులో నవీన
యుగ ప్రారంభము.

పదు నేనవ శతాబ్దముతో మధ్యమయుగము ముగిసి యూరపుఖండమున నవీన యుగము ప్రారంభ మయినదని చరి త్రకారులు వ్రాసియున్నారు. ఆ శతాబ్దములో యూరపుఖండములోని అన్ని దేశములలోను 'ద్యావ్యాపకము బాగుగా జరిగెను. అచ్చు వేయుట కని పెట్ట డినది. ఒక్కొక్క గ్రంథమునకు ఎన్ని వేలపతులై నను, బహు తేలికగసు త్వరితముగను అచ్చువలన తయారు చేయుటకు వీల మ్యెను. ఇది జ్నానవ్యాపకమునకు మిగుల తోడ్పడినది. ప్రాచిన నాగరికత కాలవాలమగు గీసు దేశము' ముసల్మాలచే జయించబడుటవలన నాదేశములోని చాలమంది పండితులు, తత్వశాస్త్రజ్ఞులను ముసల్మానుల పాలనము క్రింద నుండుటకిష్టము లేక ఫ్రాన్సు, జర్మనీ, ఇంగ్లాండు, స్పెయిన్ మొదలగు క్రైస్తవ దేశముల కనేక ప్రాచీన