పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

53

అయిదవ అధ్యాయము


బడెను. ఆమె భయపడి "అయ్యా! నేను బీదదాననగు యువ తివి. యుద్ధములను నడిపించుట నా కెటుల సాధ్యమగును?” అని జబాబు చెప్పెను. “మహాత్ములగు 'సెంటు కాథరిన్, సెంటు మార్గరెటులు నీకు సహాయము చేతురు లెమ్ము.” అని యాదివ్య స్వరూపము అదృశ్యముయ్యెను. ఇటుల అనేక సార్లు ఆమెకు మహాత్ములు ప్రత్యక్ష మగుటయు " లెమ్ము, దేశమును సం రక్షింపుము. విదేశీయులను వెడలగొట్టుము. నీ రాజునకు జయము నిమ్మ" అని చెప్పుటయు ఆమె వినుచుండెను. ఆమె యొక్క పరితాపము హెచ్చెసు. ఈ మహత్కార్యమును చేయు టకే తాను జన్మించెనని ఆమెకు తోచుచుండెను. ఆ మెతండ్రి, కీసంగతి తెలుపగా ఆమె సైనికులతోకూడ వెళ్లట కాయన సమ్మ తించలేదు. ఆమె పినతండ్రి యింటికి వెళ్ళినది. ఈ యుదంతమం తయు చెప్పినది. ఆయన అచటి సైనికాధికారి కా వృత్తాంత మెరింగించెను. సైనికాధికారి యిట్టి ఉన్మత్తురాలిని తన యొద్దకు పంపవలదని చెప్పెను. ఆమె తాను నడచియైన పోయి రాజు దర్శనము చేసితీరవలెనని నిశ్చయించెను. ప్రజ లామెపట్టు దలకు ఆశ్చర్యమును పొందిరి. ఆమె రాజదర్శనము చేయు టకు సైనికాధికారి అంగీకరించు నటుల చేసిరి. ఆమె వెంట్రు, కలను కత్తిరించి పురుష వేషమును ధరించి • గుఱ్ఱము నెక్కి కత్తిని చేతిధరించి బయలు దేరెను. ఆరుగురు చక్రరక్షకులతో రాజదర్శనమున కై శత్రువులున్న ప్రదేశము దాటిపోవలసి వచ్చెను.కూడసున్న వారి కామె ధైర్యమును చెప్పుచుండెను. “భయపడవలదు. భగవంతుడు సన్నీ కార్యమునకై నియో'