పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
48

ఫ్రెంచిస్వాతంత్ర్యవిజయము

"ఫిలిప్పురాజు గారిని ప్రజలమైన మేము ఈ దేశ వ్యవహారము లలో భగవంతునితప్ప మీ రెవరియొక్క - అధికారమును అంగీ కరించవద్దని ప్రార్ధించుచున్నాము," అని ప్రజాప్రతినిధులు చెప్పిరి. దీని నాధారము చేసికొని ఆయన పోపును నిర్లక్ష్యము చేయగలిగెను. . ఆ సంవత్సరముననే పారిసుసగరమున ప్రధాన న్యాయస్థానము నొక దానిని ఏర్పరచెను. దీనికి పారసు పార్లమెంటు అని పేరు. ఈన్యాయస్థానములో పేరుపడసిన న్యాయవాదులను న్యాయాధిపతులుగా నియమించెను. రాజు యెక్క స్వంత భూములలోని ప్రజల పై నసు, రాజుకిందనుం డిన దేశములోని యావత్తుపట్టణముల ప్రజల పైనను, రాజున కును క్రింది ప్రభువులకును గల తగాదా విషయములోను విచారించి తీర్పు చెప్పుచుండిరి. ఇది క్రమముగా దేశమునకంత కును ప్రధాన న్యాయస్థాన మయ్యెను. అన్ని తగవులను రాజు విచారించవచ్చు నను నాచారము బయలు దేను. నాలుగవ ఫిలిప్పుకుమారుడగు పదియవలూయి కాలమున ప్రభువులు రాజుయొక్క, మంత్రులను చంపి తమకదివరకుగల హక్కు లను తిరిగి చలాయించిరి. నాలుగవ ఫిలిప్పును, ఆయన కుమా రుడును కొంతసొమ్ము పుచ్చుకొని చాల మంది వ్యవసాయక బానిసలకు స్వేచ్ఛనొసంగిరి.

ఇంగ్లీషు పరాసు
దేశముల మద్య
నూరు సంవత్సరముల
యుద్ధము

ఆకాలమున, యూరపు ఖండమున ఇంగ్లాండు, ఫ్రాన్సు దేశములు ప్రధానములుగ నుండెను. 1337 సం॥ నుండియు నీరెండు దేశములకును మధ్య మధ్య కొద్ది విరామములతో నూరు సంవత్సరముల