పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయిదవఅధ్యాయము

47


భూములనుండియు చాల సొమ్ము వచ్చుచుండెను. వీలైనంత వరకు ఆయన తన స్వంత పటాలములను జీతములిచ్చి పెట్టు కొనెను. తన సామంత ప్రభువుల మీద ఆధారపడ లేదు. ఆయన కాలమున రాజుగౌరవము హెచ్చెను. ప్రభువులు రాజునకు భయపడుచుండిరి. ఈయన మనుమడగు సెంటులూయి యొక్క పాలనమున 1242 సం.న పరాసు దేశములోని సామంత రాజు లేక మై రాజుమీద తిరుగబడగ రాజు వారినోడించి శిక్షిం చెను. ఇంతటినుండియు పరాసు దేశములోని ప్రభువులు రా జును ధిక్కరించెడి స్థితిలో లేరని చెప్పవచ్చును. సెంటులూయి రాజుకాలమున టూలోను రాష్ట్ర మున కలతలు గలిగి యరా ష్ట్రము "సెంటులూయిస్ కి చేరెను. ఇందువలన విశాలలమైనట్టియు భాగ్యవంత మైనట్టియు భాగములు రాజు యొక్క స్వంతభూము' లలో చేరెను.

ప్త్రథమ స్టేట్సు
జనరలు.

ఈయన మనుమడగు నాల్గవ ఫిలిప్పు కాలమునకు రాజు యొక్క స్వంతభూములు పరాసు చేశములో మూడింట రెండు భాగము లుండెను. ఈయనకును క్రైస్తవ ప్రధాన మతాచార్యుడగు పోపునకును కలహ ము కలిగెను. పోపు ఈయనను వెలి వేసితినని ఆంక్ష పత్రమును పంపెను. ఆంక్ష పత్రమును ఈయన తగుల బెట్టి వేసెను. పరాసు దేశమును తనపక్షమున నుంచుకొనుటకై 1302 వ సంవత్సర మున స్టేట్సుజనరలు అను దేశ ప్రతినిధి సభను సమావేశ పర చెను, మతగురువుల నొక సభ గాను, ప్రభువుల నొక సభగాసు, ప్రజాప్రతినిధు లొక సభ గాను కూడునట్లు చేసెను. ఆసభలో