పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగవ అధ్యాయము

39

ప్రభువులు గొప్ప సైన్యములతో బయలు దేరిరి, కాని వీరిలో నైకమత్యము లేక పోయెను. గ్రీకురాజు త్రోవలో మరణించెను. ఇంగ్లీషు రాజును ఫ్రెంచి రాజును కలిసి సాలడిస్ చక్రవర్తి యొక్క సైన్యముల నోడించి ఏకరును పట్టుకొనిరి. అంతట వీరిలో కలహములు గలిగి పరాసురాజు తన దేశము నకు వెడలి పోయెను. ఇంగ్లీషు రాజు కొంత కాలముండి ఏమియు చేయజాలక మరిలిపో మెను . ఇంగ్లీష్ రాజు తాను పట్టుకొనిన ముసల్మాను ఖయిదీ లనందరిని చంపెను. సాలడీను తాను పట్టు కొనిన క్రైస్తవ ఖైదీలను విడిచి పెట్టెను.

(3)

నాలగవ
యుద్ధము

పోపు మూడవ యిన్నోసెంటు క్రైస్తవ ప్రపంచమున కంతకును ఐక్యత గలించి ముసల్మానుల నోడించ దలచి తిరిగి యుద్ధమును ప్రకటించెను. ఈ పర్యాయము రాజు లెవరును చేర లేదు. అనేకులు ప్రభువులు "" క్రైస్తవ సైన్యములతో ముసల్మానుల పైకి బయలు దేరిరి. త్రోవలో నీ క్రైస్తవ సేసలు ఇటలీ దేశములోని "వెనీసు షట్టణమున దిగెను. సిరియూ పైకి వెడలుటకు పడవల నిమ్మని వెనీసుపట్టణము యొక్క ప్రజాప్రతినిధి సంఘమును కోరిరి. వెనీసు వారు. క్రైస్త వులు. ఆ కాలమున ఆసియాకును యూరఫునకును మధ్య జరుగుచుండిన వర్తకమునకు వెనీసు ప్రధాన స్థానముగ నుం డెసు. వెనీసువారికి మత యుద్ధముల వలస వర్తక లాభము కలు గుచుండెను. వెనీసుకు ఏడ్రియాటికు సముద్రము యొక్క తూర్పుతీరమున నున్న జూరాయను క్రైస్తవ పట్టణము వర్తక ములో చాలపోటీగ నుండెను. ముసల్మానుల పై వెడలుటకు