పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
38

ఫ్రెంచిస్వాతంత్ర్య విజయము

సామంతరాజులు వధింపడి 'సై స్యములు చెల్లా చెదరయ్యెను. అతడు తనతో నున్న వేలకొలది. క్రైస్తవ యాత్రికులను వదలి గ్రీకుల పడవలలో నెక్కి కొలది సైన్యముతోను, సామంత ప్రభువుల తోడను ఆంటియాకు చేరెను. వెనుక విడచి పెట్టబడిన యాత్రికులు తురుష్కులచే చంపబడిరి. మూడు వేల మంది 'యేసు క్రీస్తు తమ్ము మోసము చేసెనని నిందించి, తమ ప్రాణ సంరక్షణము కొరకు ముసల్మాను లైరి. ఆంటీయాకు నుండి లూ యీ రాజు యాత్రకై. జెరూసలేము వెళ్ళి యాత్ర పూర్తి చేసి కొని మాస్కసు పట్టణమును ముట్టడించెను. ఇచట ముస ల్మానులచే నోడింపబడి చాలవరకు జనమును పోగొట్టుకొని తన దేశమునకు మరలి వచ్చెను. ఇటుల రెండవ దండయాత్ర వలస క్రైస్తవు లనేక వేల మంది వృథగా చంపబడిరి. ముస ల్మానుల బలము హెచ్చెను.

మూడ్డవ
యుద్ధము

ఇంతలో గొప్ప ముసల్మాను రాజొకడు బయలు దేరెను . ఈజిప్టు రాజగు సాలడిన శూరుడు. ఔదార్యవంతుడు. దయా దాక్షిణ్యములకు ప్రసిద్ధి కెక్కి నవాడు. ఈయన ముస ల్మాను రాజ్యము విస్తరింప జేయుటకై బయలు దేరి, సిరియాను జయించి, క్రైస్తమల నోడించి, 1187 సం||న జెరూస లేమును, చుట్టుపట్ల క్రస్తవ రాష్ట్రములను ఆక్రమించుకొనెను. కాని ఆయన క్రైస్తవులను ఔదార్యముతో చూచి మత స్వేచ్ఛ నొసంగెను. జెరూసలేము ముసల్నాను చేతులలో పడుటవలన యూర పుఖండములో సంక్షోభము పుట్టెను. ఇంగ్లాండు యె క్కయు ప్రాస్సు యొక్కయు రాజులు, గ్రీకు చక్రవర్తి, అనేక