పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
37

నాలుగవ అధ్యాయము

38

ఉండకు శమును లోకమునకు ప్రసాదించిన ఏసుక్రీస్తు ప్రభువు యొక్క సమాధిని స్వాధీనమును పొంది. జెరూసలేములో క్రైస్తవ ' రాజ్యము స్థాపించబడెను.

రెండవ
యుద్ధము

ముసల్మానులనుండి. జయించిన చుట్టుపట్టు దేశము నాల్గు రాష్ట్రములుగ విభజించబడి క్రైస్తవప్రభువులచే పాలించబడు చుండెను. వీరు నలుగురును జెరూసలేములోని క్రైస్తవ ప్రభువుకు సామంత రాజు లైరి. వీరు కాన్ స్టాంటినోపిలులోని గ్రీకు చక్రవర్తికి చేసిన భక్తిప్రయాణము నకు వ్యతి రేకముగ స్వతంత్ర రాజ్యమును స్థాపించుకొనినందున గ్రీకు చక్రవర్తి వీరియందు ద్వేషమువహించి తురుష్కులతో కుట్రలు సలిపెను. కొలదీ కాలములో ఈ నాలుగు క్రైస్తవ రాష్ట్రముల మధ్యను కూడ బేదాభిప్రాయములు, మనస్పర్ధలు కలిగెను. ముసల్మాను లీ సంగతి కని పెట్టి వీరి పై దండెత్తి 1141 వ సంవత్సరములో ఎడెస్సా పట్టణమును పట్టుకొనిరి. దీనివలన యూరపుఖండమున భయముకలిగెను. పోపు ముసల్మానులపై యుద్ధమును ప్రకటించెను. పరాసు దేశవు రాజగు ఏడవ లూయి కొన్ని సైన్యములతో ముసల్మానుల పైకి "దాడి వెడలెను. జర్మనీ నుండియు కొన్ని సైన్యములు బయలు దేరెను. కాని యూ రపుఖండము వెనుకటి యుత్సాహమును చూపలేదు. ఫ్రెంచి సైన్యములును జర్మములును ఆసియా మైనరులో చేరిరి జర్మనులను క్రైస్తవులగా గ్రీకులు 'మోసపుచ్చి ముసల్మానులకు నొప్పగింత చేసిరి. జర్మనులు తురుష్కులచే వధించబడిరి. పరా సురాజగు లూయికూడ తురుష్కులచే నోడించబడెను. అతని