పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రెంచిస్వాతంత్ర్యవిజయము

నాలుగవ అధ్యాయము

ముసల్తానులకును క్రైస్తవులకును యుద్ధములు

ముసల్మానుల పై
క్రైస్తవుల మత
యుద్ధము.

పదునొకొండవ శతాబ్దమున మతగురువుల ప్రాముఖ్య మెక్కువయినది. క్రైస్తవ ప్రధానమతాచార్యుని (పోపు) మాట యూరపుఖండమంతయు శిరసానిహించినది. అం తకు పూర్వము కొంత కాలమునుండియు ప్రజ లలో మతవిశ్వాస మెక్కువై యా త్రలు చేయు నభ్యాసము ప్రబలినది. ముఖ్యముగ ఏసుక్రీస్తుప్రభువు యొక్క సమాధిగల జెరూసలేముకు యాత్రసలుపుట మిగుల పుణ్య కార్యమని తలచిరి. యూరపుఖండమునుండి యనేక లక్షలమంది క్రైస్తవులు ప్రతిసంవత్సరమును ప్రభువు యొక్క