పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
32

ఫ్రెంచిస్వాతంత్ర్య విజయము

పక్షమున న్యాయముగలదనియు నోడినచో .యజమాని షక్ష. మున న్యాయము లేవనియు తీర్పు చెప్పబడును. కాని పై ప్రభు పుతో చెప్పుకొని అక్కడ పోరుసలుపుటకు బదులుగా ప్రభు వులు తమ కెవరయిన అపకారము గావించినచో ప్రతిక క్షి కి ముందుగా తెలిపి స్థలనిర్ణయము చేసికొని వారిమీదికి తామే పోరాటమునకు బయలు దేర సాగిరి. ఇట్లు ప్రభువులు తమలో తాము తరుచుగా పోరాడుచుండిరి. ఈ పోరాటపు పద్ధతి ప్రభు పులు కాని సామాన్య ప్రజలకుగూడ వ్యాపింప జేయబడెను. ఒకరి మీద నేరారోపణ జరిగినపుడు నేరమారోపింపబడిన ముద్దాయి తాను నిర్దోషినని ఋజువు చేసికొనుటకు మండుచున్న విప్పులలో నుండి నడుచుటగాని మసలుచున్న నీటిలో చేతినుంచుటగాని. ఎఱ్ఱగా కాలిన ఇనుపకడ్డీని చేతితో పట్టుకొనుటగాని చేయు వలెను. నిర్ణీతమైన దినములలో కాలిన దేహము స్వస్థత చెందినచో నాతడు నిర్దాషియనియు బాగు కానిచో దోషి యనియు తీర్పు చెప్పబడును. ఈ విధమయిన విచారణ పద్ధతి యూరఫుఖండములోని యన్ని దేశములలోను కొన్ని . వందల సంవత్సరము లమలులో నుండెను.