పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/44

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ అధ్యాయము

31

కాని మతగురువులు తమ మఠములలోను దేవాలయములలో ను పాఠశాలలను బెట్టి గొంతవఱకు సామాన్య జనులలో విద్యా వ్యాపకము చేయుచుండిరి. అనేకమంది మగురువులు గొప్ప పండితులై కవిత్వము తత్వశాస్త్రము మొదలగునవి వ్రాసి ప్రసిద్ధి కెక్కిరి. క్రమముగా వ్యవసాయక బానిసలను దేవుని పేర బానిసత్వమునుండి విము క్తి గావించిరి.


మూడవజాతి
సామాన్య ప్రజలు


సామాన్య ప్రజలు మతగురువులచే హీనముగ చూడబడి, ప్రభువుల నిరంకుశత్వమునకును వత్తిడికిని లోబడి, వారుకోరిన నౌకరిని చేసి తీరవలసి, చెమట కార్చి కష్టించు వ్యవసాయకులు వ్యవసాయ బానిసలు ఇతర చేతిపనులు చేయు ప్రజలు ఈ మూడవజాతిలో చేరియుండిరి.'

న్యాయవిచారణ.

ఒక రాజు కిందనున్న సామంత రాజు లందరును సమా నులు. అటులనే ఒక దర్భాగల సామంత రాజు కిందగాని ప్రభువు కిందగాని యుండిన ప్రభువులందరును సమాసులు. సమానులగు ప్రభువులలో తగువులుకలిగిన చో తమ యొక్క పై ప్రభువువద్ద చెప్పుకొనెదరు. ఆయన ఉభయులను పిలిపించి రాజీగా పరిష్కరించుటకు యత్నిం చును. అటుల కుదరనిచో ఇద్దరు కక్షి దార్లను ఒక నియమిత ప్రదేశ మున స్వయముగా నొకరితో నొకరు పోరాడవలెను. పోరా ములో జయమొందినవారిపక్షమున న్యాయమున్న టుల ఆయన తీర్మానించును. ఒక కక్షిదారు స్త్రీగాని వృద్ధుగాని శిశువుగాని మతగురువుగాని అయినచో నీపోరాటమునకు ప్రతి నిధిని బంపవచ్చును. ఆప్రతినిధి పోరులో గెల్చిన యజమాని