పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
30

ప్రెంచిస్వాతంత్ర్యవిజయము

పోపుకులో బడియుండిరి. స్త్రీ లుగూడ సన్యాసిను లగుచుండిరి... ఈ గురువులజూతి వారు దేవుని కెక్కువసాన్నిధ్య మందున్నారని భావింపబడుచు సామాన్య ప్రజలకంటే వధికులుగ భావింపబడు చుండిరి. వీరికి గూడ చాల ఆస్తులుండెను. భక్తులు విశేషముగ ఆస్తుల నిచ్చుచుండిరి. క్రీస్తుశకము 1000 వ సంవత్సరాంతము నకు ప్రళయము కలిగి ప్రపంచమంతయు తప్పక నాశనమగునను దృఢనమ్మకము కైస్తవ ప్రపంచము నందలి యందరిజనులకును గలిగెను. యూరపుఖండమంతయు నాప్రళయమున కై మిగుల నాతురతతో సిద్ధపడెను. ఆ సంవత్సము యూరపులోని ప్రతి వారును మతగురువులకు గొప్ప, గొప్ప ఆస్తి దానములను చేసి. ప్రతి వారును పాసములకొరకు పశ్చాత్తాపపడి ముందులోక ఘు న కై సిద్ధపడియుండిరి. కాని నూతన సంవత్సర ప్రారంభ పురోజున సూర్యుడు చక్కగా ప్రకాశించెను. ప్రళయమురాక నీ ప్రపం చము యధాప్రకారముగ నే నడుచుచుండెను. ప్రజలభయము భ్రమ తొలగిపోయెను. దేశములోని అయిదవవంతు భూమి మతగురువుల కిందికి వచ్చెను. మతగురువుల ఆస్తికి సంబంధించి నమట్టుకు వారును ప్రభువులై తముభూములను రాజులనుండి గాని ప్రభువుల నుండి గాని సామంతులుగ మొఖానా షరతులకు లోబడి గ్రహించుటయు తమకు సామంతులుగా ప్రభువులకు గాని ఇతర మతగురువులకు గాని అదే ప్రకార మిచ్చుటయు జరుగుచుండెసు. వీరు స్వయముగా యుద్ధమునకు పోగూడదు కావున ప్రతినిధు లను బంఫుచుండిరి. వీరికి భూఖామందులుగ ప్రభువులతో బాటు న్యాయవిచారణాధికారము మొదలగు సమస్త హక్కులుండెను.