పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ అధ్యాయము

29


ధములను ధరించవచ్చును. కోటలు నిర్మించుకొనవచ్చును. కొందరు నాణెములుకూడ వేసికొనవచ్చును. వీరిక్రింద నుం డిన భూములకు పైవారికి సైనిక కొలువుతప్ప చెల్లించవలసిన పన్నులు లేవు. క్రమముగా నీ ప్రభువులు తమలో తాము యుద్ధ ములు చేయుచు చుట్టుపట్టు ప్రాంతములలోని ప్రజలను దోచు కొనుచు దేశములోని అరాజకమునకును, కామమునకును కారకులైరి. పదకొండవశతాబ్దమున యూరపుఖండమున మితి లేని అరాజకము, దోపిళ్ళు, హత్యలు ప్రబలి మహా క్షామము కలిగెను. ప్రజలు మానవకళేబరములను తినిరి. ప్రభువులు ప్రతివారిమీదీకిని కత్తిదూయుటకు సిద్ధముగా నున్నను స్వాతంత్యప్రియులై ఆత్మగౌరవమువముగలవారైయుండిరి. స్త్రీల, అనాధల, శరణాగతుల సంరక్షణ తమ ప్రధాన ధర్మమని తలచిరి. వీరు కవిత్వమును చిత్ర లేఖనమును కొంతవ రకు పోత్సహించిరి.

రెండవజాతి
మతగురువులు.

రెండవ జాతి మతగురుపులలో రెండు రకముల వారుగలరు. బిషపులు మొదలగు పెద్దగురువులు, చిన్న గురువులు. వీరు వివాహ మాడుటకు వీలు లేదు. ప్రభువుల ఆ స్తి జ్యేష్ఠపుత్రుల కుమాత్రమే సంక్రమించు చుండినందున తక్కిన పుత్రులలో కొందరు సన్యాసాశ్రమమును స్వీకరించి బిషపులు 'మొదలగు పెద్దగురువులగు చుండెడివారు. పెద్దగురువులలో చాల వరకు ప్రభువంశీకులుగ నుండి.. చిన్న గురువులు సాధారణముగ సామాన్య ప్రజలలోనుండి యాశ్రమమును స్వీకరించినవారు. మతగురువు లందరును రోములోని క్రైస్తవ ప్రధానాచార్యుడగు