పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

249

పదు నాఱవ అధ్యాయము

గుఱ్ఱములను బండ్లను సమర్పింపవలెను. ఫ్రెంచి దేశ మంతయు, నవరసములను బట్టి యొక సైనిక ప్రదేశముగా భావిం చపలెను,” అని ప్రచురించిరి. ఫ్రాన్సు దేశములోని పదునెనిమిది ఇరువదియైదు సంవత్సరముల మధ్య వయస్సుగల యువకు లందురును మాతృదేశము యొక్క సంరక్షణకొరకు చెప్పనలవి గాని యుత్సాహముతో సైన్యములోచేరి యాయుధములను ధరించిరి.. యుద్ధసామగ్రులను, అహర సామగ)లను దుస్తులు మొదలగువానిని ఫ్రెంచి స్త్రీలు , పురుషులు తయారు చేసిరి.. అతి శీగ్ర కాలములో పండ్రెండు లక్షల మంది ఫ్రెంచి సైనికులు పదునాలుగు సేనలుగు విభజించబడి, దేశ రక్షణదీక్ష పరులగు సేనానులక్రింద ఫ్రాన్సుయొక్క యన్ని వైపుల సరిహద్దు లకు బయలు దేరి వెళ్లిరి.


మొదటి సంపుటము సమా ప్తము