పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
238

ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము

టించిరి. ఇంగ్లాండు ఫ్రాన్సు దేశము నణచుటకు యూ వచ్చ క్తిని విని యోగించెను. ఆ కాలమున ఫాన్సుదేశము సాగరికతలో యూ రవుఖండమునం దగ్రస్థానము వహించియున్నది. ప్రపంచము యొక్క, వర్తకములోను పలుకుబడిలోసు ఇంగ్లాండుకు పోటీగా నున్న దొక్క ఫ్రాస్సు దేశమే, అప్పటి తక్కిన దేశములు తగ్గు స్థితిలో నున్నవి. ఇట్టి మంచి యవకాశమును జార విడువక యూరోపులోని రాజులనందరను పోగు జేసి ప్రాస్సును వెడల గొట్టిన యొడల తనకు ప్రాన్సు దేశపు పోటీ పోయి అమెరికా ఖండములోను హిందూ దేశములోను అడ్డు లేకుండ రాజ్యమును వ్యాపింప వచ్చు సనియు యూరోపు ఖండమున తానగ్రస్థానము వహించ వ చ్చుననియు, ఇంగ్లాండు యొక్క ఆభిప్రాయము. అప్పటికి హిందూ దేశములో కొద్ది భాగము మాత్ర మాంగ్లేయుల క్రిందికి వచ్చి నది. స్వదేరాజులు ఇంకను పెక్కు మంది యుండిరి. ఎంత ద్రవ్య ము నైన ఖర్చు పెట్టి ఫ్రాన్సును కూల దోయవలెననియే ఇంగ్లాండు యొక్క పట్టుదల. ఆరు నెలల లోపల ఫాన్సుకు . వ్యతిరేకముగ యురోపులోని వివిధ ప్రభుత్వములలో ఇంగ్లాండు దేశము యొడంబడికలు చేసికొనెను. అనేకమంది రాజులకు ద్రవ్యమిచ్చి ఇంగ్లాండు యుద్ధము లోనికి తెచ్చెను. మార్చి 4 వ తేదీన ఇంగ్లాండునకును హనోవరుకును వడంబడిక ; మూర్చి 25 వ తేదీన ఇంగ్లాండుకును రష్యాకును సంధి.,మే 2 వ తేదీన స్పైయిన్ తో సంధి; జూలై 12 వ తేదిన :ఇటలీతో సంధి; జులై 14 వ తేదీన ప్రష్యాతో సంధి; ఆగష్టు 30 వ తేదీన ఆస్ట్రియా చక్రవర్తితో సంధి; సెప్టెంబరు 21 వ తేదీన పోర్చు