పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/247

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
236

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము


ఈవిధముగా ముప్పదితొమ్మిదో యేట , పదునాలుగున్నర సంవత్సరమలు రాజ్యపాలన చేసి, ఫ్రాన్సు యొక్క మిక్కిలి , యోగ్యుడగునట్టియు మిక్కిలి బలహీను డయినట్టియు రాజు మరణించెను. ఆయసపూర్వుల పరిపాలనా లోపములవలన ఆయన కాలములో గొప్పవిప్లవము కలిగెను. దైవభీతియు ప్రజలయందు ప్రేమయు నాయన కుండెను. కాని ప్రజలలో కలిగిన నూతన భావములను సరిగా గ్రహించి వానికి తాను నాయకుడై ప్రజలను నడించగల దూర దృష్టియు సామర్థ్య మును ధైర్య స్థైర్యములును కలిగియుండ నందున ప్రజాశక్తి కాహుతుడయ్యెను.