పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

229

పదునేనవ ఆధ్యాయము

ఈ స్థితిలో నుండగా జాతీయసభకు లూయిని తీసుకొని రావలసినదని పురపాలక సంఘద్యోగి యగు సాంటెరీ నీ కుత్తరుపు చేసిరి. ఆయనయును ప్యారిసుపుర పాలనాధ్య కుడును టెంపిలు కోటకు వెళ్లి రాజుతో నీసం దేశమును, చెప్పి 'దయచేసెదరా' యని యడిగిరి. ఒక్క నిమిషం మాలోసించి లూయి రాజు వారి తోకూడ వెళ్ళెను. లూయీ రాజు జాతీయ సభలోనికి ప్రవే శించి యన్ని వైపుల నొక్కసారి వీక్షించెను. జాతీయ సభాధ్య క్షుడు లూయి... ఫ్రెంచి జాతి మీమీద నేరములు మోపు చున్నది. అవి మీకు చదివి వినిపించెదను. కూచ్చుండీ" యని చెప్పెను. అదివరకే వేయబడి యున్న యొక యాసనము పై లూయి కూర్చుండెను. చాల సేపు విచారణజరిగెను. లూయీ మన స్తైర్యముతో ఈ ప్రతిప్రశ్నకును స్పుటముగా సమాధానము చెప్పెను.. తన ప్రవర్తన నిష్కల్మషమయినదనియే యాయన చెప్పెను. దేశ శతృపులతో తాను రహస్యాలోచనలు జరుప నే లేదని చెప్పెను. లూయీ దస్కతు గల దవస్తా వేజులను ప్రతిపక్షులు చూపిరి. లూయీ వేనిని తనదస్కతని యెప్పు కొనలేదు. ఇనుప మూత వేసిన సురంగము సంగతి తనకు తెలియదనెను. తస తరఫున వాదించుట కొక న్యాయవాది నియ్యవలసినదని లూయీ కోరెను. విచారణకు తిరిగి వాయిదా వేయబడెను. లూయీని తిరిగి టెంపిలు కోటలో విడిచి.


అతివాదు లా క్షేపించినను జాతీయ సభవారు లూయీరాజునకు న్యాయవాది నిచ్చుటకే యంగీక రించిరి. జాతీయ సభ్యులలో నొకరగు సుప్రసిద్ధ న్యాయవాది మాలే .