225
పదునేనవ అధ్యాయము
నారాయి రాజు ఉత్తరము వ్రాసినట్లు బయల్పడెను. “ఈయద్దమువలన త్వరగా నీ రాజద్రోహులును అనీతిపరులు నగు ఫ్రెంచిమూ తలమీద యూరపురాజు లందరు నొక్కుమ్మడిగా వచ్చెదరు. రాజులయొక్క లక్షయేబది వేల మంది సైనికులును అరువది వేల మంది దేశ భ్రష్టులును వచ్చి మీకు సహాయముచే తు" రని బిషపు రాసిన ప్రత్యుత్తరముకూడ దొరకెను. రాజు బహిరంగముగా తన సోదారుల మీద బహిప్కారశాసనము చేసి, రహస్యముగా వారితో నాలోచనలు జరుపుచున్నట్లును బుజు వయ్యెను. ఇంతేగాక" ట్యూలరీ మందిరములోని ఒక మూల నున్న గోడలో ఇనుపతలుపు చే మూయించియున్న సొరంగము లోకూడ. కొన్ని దస్తావేజులు దొరకెను. లూయీరాజు విదేశీయూతో కుట్రలు జరుఫుటయేగాక. స్వదేశములోకూడ తిరుగు బాటులులు జరుగు కు కుట్రలు చేసినట్లును, మితవాదులను ప్రోత్సహించి శాసన సభను కూలద్రోయ యత్నించి నట్లును వీని వలన స్పష్ట పడెను.
ఇందు వలన నతి వాదుల వాదమునకు ప్రోద్భలము గలిగెను.
రాజును రక్షించదలచిన వారి పక్షము బలహీనమయ్యెను.
జాతీయ సభలో రాజు విచారణ సంగతి చర్చకు వచ్చి
నప్పుడు కొందరు రాజు చుట్టములకు మించిన వాడనియు,
నాయనను విచారించుట కెవరికిని అధికారము లేదనియు, వాదించిరి.
లూయి. రాజవిచారణ జరుగవచ్చునా, జాతీయసభ
వారు విచారించ వచ్చునా, యను విషయములను గూర్చి యభి
ప్రాయమిచ్చుట కేర్పరుపబడిన న్యాయవాదుల యుప సంఘము