పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

221

పదు నేనవ అధ్యాయము

వక్తలునే కాని, ఏ సమూహములను తమ యభిప్రాయములు : లోనికి త్రిప్పుకొనుటకు ప్రయత్నించ లేదు. సామాన్య ప్రజలలోని యాందోళసమును నిర్లక్ష్యముగా జూచిరి. ప్యారిసుప్రజలు అల్లరుల కెల్ల కారకులగుచున్నారని బెదరించి, ముఖ్య పట్టణము యొక్క సానుభూతిని గోలుపోయిరి.. ప్యాతిసు యొక్క- పలుకు బడినుండి రాష్ట్రములను వేరు చేయవలెనని ప్రయత్నించిరి కాని సాగలేదు.

2

యుద్దము.

యుద్ధము సాగుచుండెను. ప్రెంచి సైన్యములు జాతీయ వాదులగు యౌననులతో నిండియుండెను. వీరు దేశము కొరకై కార్చిచ్చులో దుముకుటకును కంఠములు గోసియిచ్చుటకును సిద్ధపడిన వారు. దుస్తులలోను ఆహారములలోను ఎట్టిలోపము లున్నను, పోనీ సన్నిటికిని సంతోషముగా సహించుచున్న వారు. వీరిలో చాలమంది జీతములు పుచ్చుకొన కుండ వచ్చినవారు. తమ దేశము యొక్క ఘనతకై యుద్ధములో ముందునకు. దుముకుచుండిరి. ఇట్టి ధైర్యశాలరగు సైన్యములను యూరవు. ఖండ మదివర "కెన్నడును చూచి యుండ లేదు. ఫ్రెంచి సైన్య. ములకే ప్రతిచోటను జయముకలిగెను. ఫ్రెంచి సేన లిటలీలో జొరబడి శత్రువుల నోడించి ' సావాయి, వైసీ, సార్డినియా లను లోబరచుకొనెను. జర్మనీలో ప్రవేశించి రైన్ రాష్ట్రము లను కొంతవరకు ఆక్రమించుకొని మైంజు, ఫ్రాన్కు పర్డు కోట లను పట్టుకొనెను. బెల్జియము పై ఫ్రెంచి సేనలు దండెత్తి