పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
216

ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము

నము చేసెను. ఇందుమిద ప్యారిసు ప్రజ లాగ్రహ పరవశులైరి. ఆగష్టు నెల 10 వ తేదీన ఉదయము 7 గంటలకు ప్యారిసుప్రజ లును జాతీయభటులుసు ఆయుధము'లను ధరించి ట్యూలరీమం దిరమును ముట్టడించిరి.. రాజు యొక్క విదేశీయభటు లెదిరించిరి. ప్రయోజనము లేదయ్యెను. రాజుచెం తనున్న జాతీయ భటులు ప్రజలలో కలిసిరి. రాజు కుటుంబముతో గూడ పారి పోయి శాసనసభామందిరములో శరణు జొచ్చెసు. శాసనసభ వారు రాజును కుటుంబమును ఆమందిరము యొక్క కొన్ని గదు లలో రెండురోజులుంచి ప్రజల యాగ్రహము నుండి సంరక్షిం చిరి. శాసనసభకు ప్రజలు వచ్చి వెంటనే రాజును పదభష్టుని చేయవలసినదని కోరిరి. సెప్టెంబరు 21 వ తేదీన ప్రభుత్వ పద్ధతిని నిర్ణయించుట కొక నేషనల్ కన్వెషనును జాతీయ సమా వేశము) కూర్చుటకును, రాజును -రాజ్య బ్రష్టు ని చేయు జవాబుదారి వారికి వదలుటకును, అంతవరకును రాజును అధి కారమునుండి తొలగించి ఆయన ఏర్పరచిన మిత వాదమం త్రులను దీసి వేయుటకును, శాసన సభవారేకాగ్రీవముగా తీర్మా నించిరి. వెంటనే గిరాండిస్టుమంత్రులను శాసనసభవారు నియ మించిరి. జాతీయ ప్రభుత్వము సకు వ్యతిరేకులను మతగురువు లను షుమారు నాలుగు వేల మందిని దేశబ్రష్టులను గావించిరి. సైన్యములకు తగు ప్రోత్సాహము కలుగ జేయుటకై కమీషనరులను బంపిరి. పదునారప లూయీ రాజు కుటుంబముతో కూడ సెప్టెంబరు 21 వ తేదీన ప్యారిసులోని టెంపిలుకోటలో విడి ఖైదులో నుంచబడెను. యూరపునంతను గడగడ వణంక .