పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

రాజును . బయిటకు శాంతికి భంగము కలుగలేదు. ఈ యనుభవమువలన రాజు పేరుకు మాత్రమే కలడనియు, రాజు లేకపోయినను .ఫ్రెంచి జూతికి నష్టము లేదనియు, ప్యారిసు నగరమును, ప్రాన్సు దేశ ముసు గ్రహించినవి" అని ఫెర్రీరు ప్రభువు చెప్పెను.

రాజును
పట్టుకొని
తెచ్చుట

ఈలోపున లూయిరాజును ఆయనకుటుంబమును ప్రయాణము పూర్తిచేయుచుండిరి. ప్రథమదిసమున జయప్రదము గా సాగుటవలనను, ప్యారిసునుండిచాల దూరము వచ్చినామను సంతోషమువలన ను, లూయిరాజు అజాగ్రత్తగానుండి బండిలో నుండి అటునిటు చూడసాగెను. 21 వ తేదీ సాయంత్రము సెంటుమెనిహల్దువద్ద పోస్టుమాస్టరు జనరలగు డ్రూయి, రాజును గుర్తించి బండి వెంట పోయెను. ఆరు గంటలు కొట్టు సరికి రాజు బండిలో విర్రిసు చే రెను. గుఱ్ఱము లసియున్నందున అక్కడ సిద్ధముగా నుంచబడియున్న మరి యొక గుఱ్ఱము జతను బండికి కట్టుచుండిరి. బండి వెంటవచ్చిన డ్రూయి, నెర్రెసులోని మ్యునిసిపలు అధ్యక్షుడు మొదలగు వారిని పోగుచేసి, రాజు గారి బండి సటకాయించెను. వెర్రెను ప్రజలును అక్కిడి జాతీయ భటులును బండిని చుట్టుకొని ముం దుకు పోనియ్య లేదు. జాతీయ భటులు బొయిలీ సేనాని త్రోవలో నుంచిన సైనికుల నోడగొట్టిరి. ఆరాత్రి వెర్రెనులోని యొక - చిన్నయింటిలో రాజకుటుంబమునకు ఫలహారములు, తేయాకు నీళ్ళ నిచ్చిరి. జూ తీయటును ప్రజలును రాజు యొక్కబండిని త్రిప్పించి ప్యారిసుకు తీసికొనిపోవుచండిరి. రాజున కెక్కడను