పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
199

పదమూడవ అధ్యాయము

కలవరము ఫుట్టెసు. ఎక్కడ చూచినను ప్రజలు గుంపులు గూడి దీనిని గురించియే యాందోళనపడుచుండిరి, ఆరాత్రి కాప లాయున్న సైనికుల యజాగ్రత్తకు నిందించుచుండిరి. లఫయయతు దౌలీ సేనాధిపతులే యీపనిలో తోడ్పడిరేమోయను అనుమాన ముకూడ కొందరికి కలిగెను. ప్రాతనిరంకుశత్వమును, ప్రాతసాం ఘిక సాంప్రదాయములును తిగివచ్చుటకును, దేశ మధోగతి పాలగుటకును నిది దురదృష్టి సూచకమని ప్రజలు భావించ సాగిరి. వెంటనే జాతీయసభ వారు తగినచర్య పుచ్చుకొని ప్రజలను శాంతింప జేసిరి. జాతీయసభ సమావేశమై మంత్రు లను ప్రధానోద్యోగస్తును పిలిపించి రాజు యొక్క అధికార ములన్నీయు తమకు సంక్రమించిన వనియు, నింతటి నుండియు జాతీయసభ వారి పేరనేసమస్తకార్యములను జరుపవల సిన దనియు నాజ్ఞాపించిరి. సేనాధిపతులకు కబురంపి సేన లను జాతీ యసభ కే లోబడి నడిచుకొనునట్లు పదిలపచిరి. రాజు పారి పోవుటవలన ప్రెంచి ప్రభుత్వము విచ్ఛిన్నము కాలేదనియు, ఫ్రెంచిజాతి తరున తాము ఫాస్సు దేశ పుప ప్రభుత్వమును చేయు చున్నామనియు, నితర దేశముల ప్ర భుత్వములతో, సఖ్యముగా నుండుటయే తమ యుద్దేశమనియు ప్రకటనముగావించి, యూ రపులోని రాజుల కందరకును తెలియపలుచిరి. దేశ సంరక్షణ కొఱకు వెంటనే మూడు లక్షల ముంది. జాతీయ సైన్యములను పోగు జేయుటకు తీర్మానించిరి, “నాలుగుగంటల కాలములో ఫ్రెం చిజాతీయసభ సమ స్త అధికారములను పొందినది. ప్రభు త్యసు యథాప్రకారము సాగినది. ప్రజలలో లేశమైనను