పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
198

ఫ్రెంచి స్వాతంత్యవిజయము

(8)

రాజు పారి
పోవుట,

1791 సంవత్సరము జూప్ 20 వ తేదీన లూయిరాజు ప్యారిసును విడిచి పారిపోవ నిశ్చయించెను. జనరల్ బొయిలీ యను ఫెంచి సేనాధిపతి రాజునకు పరమ మిత్రుడు. ఫ్రాన్సు సరిహద్దున శత్రువులు సైన్యములు పోగు చేయుచున్నా రను మిష మీద తన సేనలను సరిహద్దుకు దగ్గిర నున్న మాంటుమ-డీలో నుంచెను. రాజు కుటుంబముతో మాంటుమడీకి వచ్చి ఈ సేన లను చేరుట కేర్పాటు చేసిరి. రాజు షాలోను మీదుగా వచ్చును.త్రోవలో ప్రతిచోటను రాజు యొక్క సురక్షితము కొరకు బోయి కొంతమంది సైనికుల నుంచెను. మాంటుమడీ లోని సేనలకు ప్యారీసునుండి కొంత సొమ్ము తీసికొని వెళ్ళి భద్ర ముగా నొప్పగించుటకై సైనికులను త్రోవలో పెట్టినట్లు బొయిలీ నటించేను. జూన్ 20 వ తేది రాత్రి, రహస్యముగా నొకరి తరువాత నొకరు రాజును రాణియును మారు వేషములతో ట్యూలరీ మందిరమునుండి తప్పించుకొని పోయిరి.రాజు యొక్క

తోబుట్టువు ఎలిజబెత్తును, రాజుయొక్క కుమారైయు,

కొడుకును, వారల దాదీయు కూడ ముందుగ నే పెళ్లిరి. వీరంద రుసు బోలివార్డులో సిద్ధముగ నుంచబడిన ఇద్దగుర్రవు బండిలో నెక్కి మాంటుమడికై వెళ్ళిరి.


ట్యూలరీమందిరమును కాపుదలచేయుచుండిన జాతీయ సైనికులు మైమరచియుండిరి. మరునాడు తెల్లవారగనే రాజు కుటుంబము పారిపోయిన సంగతి కని పెట్టిరి. ప్యారిసులో గొప్ప