పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

197

పదమూడవ అధ్యాయము


పైన నీసమయములో కసిదీర్చుకొనవలెననియు, విప్లవమును తమదేశములో వ్యాపింపకుండ చేయవ లెననియు నింగ్లాండు యొక్క అభిప్రాయము. ప్రష్యా రాజునకు నిరంకుశత్వమును తన రాజ్యములో స్థిరపరచుకొనుట కుద్దేశ్యము. యూరఫు. యొక్క దృష్టి ఫ్రెంచిపోరాటములో మగ్నమయి యుండగా పోలండును కాజేయవలెనని రుష్యా యొక్క ఆలోచన, తమ తోడి ప్రభువులు కోల్పోయిన హక్కులను తిరిగి నిలువ బెట్టుట జర్మనీ రాష్ట్రాధిపతుల కోరిక. 'స్పెయిన్ మొదలగు బోర్బోన్ వంశస్థులు తమవంశీయుడగు ఫ్రెంచి రాజునకు కలిగిన యవ మానమును తొలగించవలెనను తల పు. ఇట్టి వివిధ యూహలతో వివిధ రాజు లేక మై ఫ్రెంచిజా తిని నాశనముగావింప నిశ్చయిం చిరి . యూరపులోని నిరంకుశత్వమంతయు, ప్రజల స్వాతంత్ర నిర్మూలము గావించుటకు ఏక మయ్యెను. ఫ్రాన్సునుండి దేశ బ్రస్టు లైన వారు ఫ్రాన్సులో సైన్యములు లేవనియు, సరి యైన నాయకులు లేరనియు, అంతఃకలహములతో నిండియున్నా రినియు, బొక్క సమ లో దవ్యము లేదనియు, ప్రజలకు రాజునందు భక్తి యింకను గలదనియు, అల్లరులు చేయుటకు. సిద్ధముగా నున్నా రనియు, జాతీయసభయం దందరుకును విసుగు పుట్టినదనియు, ఫ్రెంచి జాతీయ ప్రభుత్వము వారు స్వ సంరక్షణము చేసికొనలేరనియు, రాజు లందఱితోను చెప్పి, వారిని ప్రోత్సాహపరచిరి. మాంచువా సమావేశ ముసంగతి రహస్యముగా ఆస్ట్రియా రాజు చారులచే ఫ్రెంచి రాజుకు కబు రంపెను.