పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

195

పదు మూడవ అధ్యాయము


చనిపోవుట నిశ్చయమని తెలిసికొని, మంచిపుష్పములను సువా సనదవ్యములను పక్కలో వేయించుకొనెను. మంచి సంగీ తమును పాడించి వినెను. “పాపము! రాజు యొక్క అధికార మును కూల్చి వేసినాము. ప్రజలు అంతఃక లహములు లేకుండ నీనూతనాధికారము నెటుల వినియోగించుకొనెదరో నను నాత్రతవలన నాహృదయము బరువుగానున్న ”దని యాఖరు మాటలు చెప్పెను.


1791 సంవత్సరము 2 వ ఏప్రిల్ తేదీన మిరాబో పరలోక గతుడయ్యెను. జాతీయసభ్యు లెల్లరును, ప్యారీసు నగర వాస్తవ్యు లెల్లరును ఆయన శవము వెంట వెళ్ళిరి. ఆయన శవమును పాన్ ధియను ప్రదేశములో పాతి పెట్టిరి. ఆప దేశములో నే తరువాత ఫ్రాన్సు దేశములోని గొప్పవారు మృతక కేబర ములను పాతి పెట్టుచుండిరి.

7

రాజు యొక్క
కుట్రలు.

మిరాబో చనిపోయిన తరువాత లూయీరాజునకు ద్దుర్భోద లెక్కువయ్యెను.1790 డిశంబరు నుండియే లూయీ

రాజు క్పర రాజులతో రహస్యాలోచనలుయ్ నడుపుచుండెను. కాని 

కియా రూపకము దాల్చలేదు. ఇంతటి నుండియు రాజు రాణి యొక్క పలుకు బడిలో పూర్తిగ నుండెను. దేశము విడిచి పారి పోయి పర రాజుల సహాయమున తన రాజ్యమును పొందవలెనను ఆలోచనలు బలమయ్యెను. రాజుతరఫున ఆయన సోదరులగు ఆర్టాయి ప్రభువును కాఁన్ డిరా కొమారుడుసు ఆస్ట్రియా రాజు