పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

194

ఫ్రెంచిస్వాతంత్ర్యవిజయం

నకు మిరాబో గట్టిగా సలహా నిచ్చెను. “దీనికి వెనుకకు బోవుట యునగా, నొకతరమువారు కష్టపడి చేసిన పనియంతయు నాశ ముచేయుటయు, రెండుకోట్ యేబది లక్షల ప్రజలు జ్ఞాపక ముంచుకొన్నాదంతయు తుడిచి వేయుటయు నగు”నని మిరాబో రాజు తో చెప్పెను. రాజును, రాణీయును మిరాబో వలన తా మింతవరకై సురక్షితముగా నున్నామని తలంచుచుండిరి... మిరాబో "మరణమువలన ప్రజల యొక్కయు, జాతీయ సభ యొక్కయు, రాజుయొక్కయ : విశ్వాసమును పొంది, దేశ మును సురక్షితముగ నడిపించుచు. ప్రజల కవసరమగు సమస్త సంస్కరణములను గానించుచుండిన గొప్ప రాజ్యాంగ వేత్తను ఫ్రాస్సు దేశము గోల్పోయెను. ఇట్టి రాజకీయధురంధరుడు ఫ్రాన్సుకు తిరిగి చిర కాలమువరకు లభించ లేదు. చనిపోవువరకు ఈయసపయుస్సు నలుపడి రెండువత్సరములు మాత్రమే గలవు. చిన్న తనములో ఈ దురభ్యాసములకు లోబడి తన యా రోగ్యమును గోల్పోయెను. తన శక్తి నశించువరకును వ్రాయు చును, మాట్లాడుచును, ఆందోళనపడుచును నుండుటవలన అకాలమరణమునకు లోనయ్యెను. ఈయనకు చాల జబ్బుచేసి నదని తెలియగానే ప్రజలు గుంపులు గుంపులుగా నీయన ఆరో' గ్యస్థితి సరయుటకై యాతురతతో నెడ తెగక గృహము చుట్టును మూగియుండిరి. గంటగంటకును ఈయనజూడ్యస్థితినిగూర్చి వైద్యులు ప్రత్యేకముగ వార్తలను ముద్రించి ప్రక టించుచుండిరి. ప్రతిదినమును రాజు మనుష్యులనుబంపి వర్త మానము తెప్పించుకొనుచుండెను. చనిపోవు దినమున తాను