193
పదుమూడవ అధ్యాయము
6
మీరాబో పరలోకగతు
డయ్యెను.
ఇట్టి స్థితిలో మీరాబో పరలోకగతు డయ్యెను. ఈయన పుట్టుక వలన ప్రభువయ్యును ప్రజల పక్షమున చేరి విప్లవములో ఏప్రధానస్థానము నాక్రమించుకొనెను, చిన్నతనములో మిక్కిలి దుడుకువాడై తనభార్యను వదలి పరుల దారల వసహరించెను. ఈయసతండ్రి మిక్కిలి కఠినమయిన శిక్షలకు పాల్సేసి, యనేకమారులు కారాగృహములో పెట్టించెసు. కాని మిరాబో యద్భుత మేధావి. గొప్ప విద్వాంసుడు. మితి లేని సాహస ధైర్యములు గలవాడు. నిష్కళంకదేశాభిమాని. యిరువదిగంటల కాలము గ్రంథ పయ్హనము చేయు చుండెను. అసామాన్యవక్తయు లేఖరియు నై, ప్రజారంజ కుడుగ నుండెను. మిక్కిలి ధైర్యముతో రాజును, తోడి ప్రభువులను ఎదిరించి, జాతీయసభలో ప్రధాననాయకు డయ్యెను. స్టేట్సుజనరల్ కూడినప్పటినుండి మరణించు వరకును విప్లవమును మీరాబో నడిపెను. అటుమిత వాదులలోను, ఇటు తీవ్ర వాదులలోను చేరక జాగ్రత్తగ తీసికొనివచ్చెను. రాజును పూర్తిగ తీసి వేయుట ఈయన కిష్ట ము లేదు. అనేక సార్లు రాజుతోను, తోను ఆయన ముచ్చటించుచుండెను. రాణి ప్రథమములో మిరాబోయందు మిక్కిలి అయిష్టము గలిగియుండెను. క్రమముగా ఉభయు లును .స్నేహితు లైరి. జాతీయ రాజ్యాంగ విధానము నంగీక రించ వలసినదనియు, లేనియెడల ప్రమాదము కలుగుననియు