పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
188

ఫ్రెంచిస్వాతంత్యవిజయము


వర కావహించియున్న మేఘములు విడి పోయి, సూర్యుడు తన కిరణములను ప్రసరింప చేసిను. ప్రజల మసులు సంతోష షముతో నుప్పొంగెను. "దేవతల యాశీర్వచనము కలిగెనని ప్రజలు తలచిరి. 'మా రాజు దీర్ఘాయు పగుగాక! మాదేశము సౌఖ్యముగా నుండునుగాక యను జయజయ ధ్వానములు మిన్ను ముట్టెను. దేశాభిమానములోను రాజభక్తిలోను సోద రత్వములోను ప్రజలో లలాడిరి..నేలమట్టముగావింపబడిన బాస్టిలు కోట ప్రదేశములో, నాటి రాత్రి ప్రజలు సంతోషముతో నృత్యములు సలిపిరి.. కొన్ని రోజులవరకు బాణాసంచు కాల్చుట,ఆటలు మొదలగు వినోచదములు ప్యారీసులో జరిగెను.


ఇంతవరకును విప్లవము సరిగా నడచెను. రాజు యొక్క- యు ప్రభువుల యొక్కయు నిరంకుశత్వము నకు బదులు: ప్రజల రాజ్యము స్థాపింపబడెను, శతాబ్దములనుండి. ప్రజులను పీడించు చుండిన ప్రతిస్థాపనములు, ప్రత్యేక హక్కులు, మామూళ్ళు నిర్మూలనము గావింపబడి న్యాయము , నీతి, సమానహక్కు బాధ్యతలు,స్వేచ్ఛ నెలకొలుపబడెను. కాని ఇంత త్వరలో ఫ్రెంచిజాతి యొక్క కష్టము లీ డేర లేదు. నూతన రాజ్య తంత్ర మును నాశనము చేయుటకు, దేశ ము బయటను, దేశములోపు లను, సరంకుశత్వము, స్వార్థపరత్వము కుట్రలు సలుపుచున్నవి. యూరప్ లోని తక్కిన దేశములన్నియు నిరంకుశత్వమునకు లోబడియున్నవి. ఆ దేశ ముల ప్రజ లింకను మేల్కొస లేదు. ఆ దేశముల పాలకులు ఫ్రెంచి జాతిపొందిన స్వేచ్ఛను సహించ లేకుండిరి.తమక్రింది. ప్రజలు ఇట్టి స్వాతంత్యములనే కోరుచు