పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

183

పదుమూడవ అధ్యాయము

, బరు 5 వ తేదీ ఉదయమున ప్యారిసునుండి అనేక వేలమంది స్త్రీలు నందరను పిలుచుకొని, :పదునొకండు మైళ్ల దూరముననున్న వర్సేల్సునకు బయలు దేరిరి.. పురుషుల గుంపులు వెనుక బయలు దేరెను. ఆ వెనుక లఫయత్ సేనాని క్రింద. జాతీయ భటులు బయలు దేరి వెళ్లిరి. ముందు వెళ్లిన స్త్రీ పురుషులు రాజమందిరమున చుట్టుకొని, జాతీయ సభామందిరములో ప్రవే శించి, రొట్టె, రొట్టె యని కేకలు వేసిరి. దినమంతయు కొత్త గుంపులు వచ్చి చేరుచుండెను. రాజు సైనికులకును. ప్రజాసమూ' హములకును కలహములు ప్రారంభమయ్యెను. ఇంతలో ఇరు వది వేలమంది జాతీయ భటులతో లయతు వచ్చెను. రాజసైని కులు వెళ్లిపోయిరి. శాంతము నెలకొల్పబడెను. మరునాడుప్రొ ద్దున ప్రజల గుంపులు రాజమందిరములో ప్రవేశంచి రాణి యెక్క. గదులను ముట్టడించిరి. రాణి భయపడి రాజు మొక్క ముందిరము లోనికి పరుగెత్తెను. లూయీ రాజు ప్రజలకు లొంగు టకు నిశ్చయించెను. రాజు మిద్దె మీదికి వచ్చి క్రిందనున్న ప్రజలకు దర్శనమిచ్చెను. ప్రజలు " రాజు ప్యాిరిసుకు రావ లెను" అని కేకలు వేసిరి. రాజును, రాణియును సమ్మతింపక తప్పినది కాదు. రాజకుటుంబము బండిలో నెక్కించుకొని ముందును వెనుకకు సు ప్రజలగుంవులు బారులు తీర్చి ప్యారిసుకు వచ్చిరి.. జాతీయ సైనికులు బండిపక్కను నడిచిరి. అక్టోబరు 6వ తేదీన రాజకుటుంబమును ప్యారిసులోని ట్యూలెరీమందిరమునకు చేర్చిరి. వెంటనే జాతీయసభ వారుకూడ వర్సేల్సు వదలి ప్యారి సులో సమావేశమయిరి. రెండు సంవత్సరముల కాలమువరకు