పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
182

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

మతగురువుల యొక్కయు కుట్రలవలన తమకు బాధలు కలుగు చున్నవని ప్రజలెంచిరి.. ప్యారీసులోని వాడుక లన్నియు పర్సే ట్సులోని రాజునకు "తెలి యుచుండెను. కొన్ని విదేశీయ సైన్య ములను రాజు తెచ్చి పెట్టుకొనెను. దేశమునుండి పారిపోవలసి' నదని కొందరు రాజునకు సలహా చెప్పిరి. 'దేశములో రాజు యొక్క అధికార మంతరించినది. విదేశమునకు పారిపోయినచో రాణియొక్క - సోదరుడగు ఆస్ట్రియాచక్రవర్తి యు. నిదివఱకే దేశమును వదలి పోయిన - రాజ బందువులును ఇతర ప్రభువులును ఇంకను రాజు పక్షము నున్న సైన్యములను రాజునకు సహా యము చేయగలరు. వారి సహాయముతో దేశముమీదికి దండెత్తి వచ్చి జాతీయసభను నాశనము కావించి, తన యొక్క, -- నిరంకుత్వము స్థాపించుకొన వచ్చునని, రాజునకు సలహాయొ సంగబడెసు. ఇందుకు రాజు సమ్మతించెను. కాని రాజు అనుమా నించుచుండెను . నూతన సైనికులు వేసేల్సుకు వచ్చిన దినమున సైనికోద్యోగు లొక విందొనర్చిరి. రాజు హాజరయ్యెను. రాణి యువరాజు నెత్తుకొని యుపన్యాస మిచ్చెను. సైనికోద్యోగులు రాజుయొక్క గౌరవమును నిలువబెట్టదమని శపదములు చేసిరి జాతీయసభను తూలనాడిరి. మూడురంగుల జాతీయ జెండాను తీసి వేసి ప్రాత తెల్ల రాజపతాక ముల నెత్తిరి. ఈ సంగ తులన్నియు మరునాడు ప్యారిసులో ప్రజలు తీవ్రముగా చెప్పు కొనసాగిరి. -జాతీయ జెండాను కాళ్ళకింద వేసితొక్కిరను వర్తమానముకూడ వచ్చెను. ప్రజలలో నుద్రేకము హెచ్చ ను. జూతీయభటులు కసితీర్చుకుని నువ్విళ్ళూరు చుండిరి. ఆక్టో