పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
173

పండ్రెండవ అధ్యాయము


ఎరుపు, తెలుపు, మూడురంగులు గల జెండా ఎత్తబడెను. "ఈ మూడు రంగుల జెండా ప్రపంచమంతను సంచరించును!" అని లఫ యతుసేనాని చెప్పెను.

రాజు ప్యారీసును
దర్శించుట,

రాజు యొక్క సోదరుడగు ఆర్డాయిప్రభువును మరికొం దరు ప్రభువులును ఫ్రాన్సును విడిచి పారిపోయిరి. తన సురక్షి తము కొరకు రాణి వెర్సెల్సులో భయపడుచున్నను, లూయిరాజు కొంతమంది జూతీయ సభ్యులను వెంటగాని ధైర్యముతో ప్యారిసునగరమునకు వెళ్లెను. ప్యారిసునగరము వెలుపలనే మ్యునిసిపలు అధ్యక్షుడగు బైలీ రాజు ంర్దుర్కొనిన, రాజభక్తి సూచకముగ నగరపు తాళపు చెవులను రాజున కర్పించెను. 'ప్రజలు రాజుగారి హృదయమును వశ పరచుకొనినా రని నమ్రతతో బైలీ చెప్పె ను. రాజు ప్రజల జయజయధ్వానముల మధ్య ప్యారిసు నగర ములో ప్రవేశిచెను. రాజు హోటలు డివెల్లికి పోయి తనటో పీలో మూగురంగుల పతాకమును ధరించి, మేడమీదనుండి ప్రజలకు దర్శనమిచ్చెను. బయట మూగియున్న వేలకొలది జను లానందపరవశులై "మారాజును దేవుడు రక్షించును గాక! "మా దేశమును దేవుడు రక్షించుగాక!" యనుగోలా హలధ్వనులు చేసిరి. రాజును తీసివేయపలెనని అంతవరకును ప్రజ లు కోర లేదు. ప్రభువులు ప్రజలు నను భేదములు పోయిన రాజు రికమునే ప్రజలు కాంక్షించిరి. రాజు ప్రజల యిష్టానుసారము పాలింలిపలెనని కోరిరి.