పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
172

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

గంటలు యుద్ధము జరిగిన తరువాత ప్రజా సైన్యములు బా స్టిలు కోటను పట్టుకుని లోన జొరబడిరి. ప్రభుత్వ సైన్యాధిపతి సేన లతో లొంగెను. సైన్యాధిపతిని ప్రజలు చంపిరి. ప్రభుత్వ సైసి కులకు క్షమాపణ నొసంగెరి. బాస్టిలుకోటలోని ఖైదీ లను విడుదల చేసిదానిని సంపూర్ణముగా నేలమట్టము గావించిరి. ఆ రాత్రి బాప్టిలుకోట పడిపోయిన దనుసంగతీ వెర్సేల్సులోని రాజునకు తెలిసెను. ప్రజలు తిరుగు బాటు చేసిరి,' అని మాత్రమే ఆయన చెప్పెను. 'అయ్యా! తిరుగు బాటు కాదు. విప్లవము ప్రాంభ మయినది,' అని లైన్ కోర్టు ప్రభువు చెప్పెను. ఫ్రెంచి సైన్యములు ప్రజలలో చేరిపోయి నందుకు రాజు చింతించెను.


రాజు ప్రజాచిత్తము నెదిరించజాలక ప్రజలకు లొంగె సు. జాతీయసభ యొక్క కోరికలు మన్నించెను. విదేశ సైన్య ములను తీసివేసెను. "నెక్కరును తిరిగి ప్రధానమంత్రిగా చేసెను. ఈసంతోష వార్తలను ప్యారిసు ప్రజలకు తెలుపుటకై జాతీయ సభవారు 'వెర్సెల్సు నుండి ఎనుబది ఎనిమిదిమంది ప్ర ప్రతినిధులను ప్యారిసునకు బంపిరి. ప్యారిసు ప్రజలు మిగుల నుత్సాహమును పొందిరి. ఆమెరికా స్వాతంత్యపక్షమున నింగ్లాండుతో యు ద్ధము చేసియున్న సుప్రసిద్ధ ఫ్రెంచి సేనాని లఫయతు ప్రభువును ప్యారిసులోని జాతీయ సైన్యములకు సేనాధిపతిగా చేసిరి. గణిత శాస్త్ర విద్వాంసుడును, టెన్ని సు కోర్టుశ పథకాలమున అధ్యక్షత వహించిన వాడునునగు బైలీని ప్యారిసు నగర పురపాలక సంఘముస కధ్యక్షుడుగ నెన్న కొనిరి. ఫ్రెంచివిప్లవమునకు గుర్తుగా నీలము