పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

170

పండ్రెండవ అధ్యాయము


నవి తీసికొని ప్రజలు బయలు దేరిరి. ప్రభుత్వమువారి సైనిక సామగ్రిగల యింటి పైబడి ఆయుధ సామగ్రిని తీసి కొనిపోయిరి. రాజ సైన్యము లేనిమిషమునవచ్చి తమ్ము ముట్టడించునో యను భీతితో ముఖ్య స్థలములలో ఫిరంగులను బెట్టి పారి సునగర సంరక్షణమునకు వలయు సన్నాహముల నెల్ల గావించిరి

. జూలై నెల 18 తేది అంతయు విప్లవము జరిగెను. ప్రజలు ప్రజలు సుకపుశాలలను తగులబెట్టిరి. చెరసాలలను తెరచి ఖైదీలను విడుదల చేసిరి. రొట్టెల అంగళ్లను కల్లుదుకాణములను దోచుకొనిరి. రాజు వెర్సెల్సు లో నుండెను. ప్యారిసులోని యధికారు. లెవ్రునును ఆటంక పరచలేదు. అటంక పరుచుటకు భయపడిరి. మ్యునిసిపలు సభ్యులు హెూటులు డి వెల్లి అను నగరులో కూర్చొని ప్రజ లకు సలహానిచ్చుచుండిరి. ప్రజలను సాయుధులగు జాతీయ సైనికులుగా తయారు చేయుచుండిరి. ఇంతలో బాప్టిలుకోట లోని రాజ సైన్యములు కోటమీద ఫిరంగుల నెక్కించిరి. ఇట్టి ముఖ్యమగు ప్రదేశము శత్రువుల స్వాధీనమందుండుట అపాయ కరమని తలచి జులై నెల 14 వ తేదీన ప్రజా సైన్యము బాప్టిలు కోటను ముట్టడించ నిశ్చయించెను. లండనులోని 'టవరు' వలె ఫ్రెంచి ప్రభుత్వ విరోధులను తరచుగా విచారణ లేకుండ నీ కోటలో పడి వేయుదురు. బాస్టిలుకోట ప్రభుత్వం ద్వేషుల కారాగృహము. లోపల కొద్ది సైన్యములు గలవు. సేనాధిపతి యాకోటను వదలుటకు సమ్మతించక పోరాడెను. అయిదు