పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
164

ప్రెంచిస్వాతంత్ర్య విజయము

మైన పనులను చేయువారు” అని ఆయన వ్రాసెను. మత గురువులలో మఠాధిపతులు ప్రభువుల పక్షమునను, చిన్న గురు వులు సామాన్య ప్రజల పక్షమునను చేరిరి. ఈవాద ప్రతివాద ముల మధ్య నెక్కరు మంత్రి సలహా పైన మొదటిశాఖయగు ప్రభువుల ప్రతినిధుల సంఖ్య యును, రెండవ శాఖయగు మత గురువుల ప్రతినిధుల సంఖ్యయును కలిసిన దానికంటే కొంచె మెక్కువగా మూడవ శాఖయగు ప్రజల ప్రతినిధుల సంఖ్య యుండునట్లు రాజు తీర్మానించెను. 25 సంవత్సరముల వయస్సు పైగలవా రెల్లరు మూడవశాఖ యొక్క సభ్యులను ఎన్ను కొనుట కర్హులని తీర్మానించబడెను. మూడు శాఖలును క లిసి కూర్చోసవ లేనా లేక విడివిడిగా కూర్చొనవలెనా యను విష చుము నిర్ధారణ చేయక విడిచి పెట్టెను. .