పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
158

ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము


లూయిరాజు పదభ్రష్టులను జేసిన కొలదియు ప్రజాభిప్రాయ ముననుసరించి పాలించుటకు లూయి అసమర్థుడని ప్రజలకు భోధపడుచుండెను. రాజునం దయిష్టము దినదినమునకు ప్రబల" మగుచుండెను,

అమెరికా
స్వాతంత్ర
యుద్ధము.

ఇంగ్లాండున కప్పటివరకు లోబడియుండిన అమెరికా పలసరాష్ట్రముల ప్రజలపై నింగ్లీష్ పార్ల మెంటు వారు నూతన పన్నలను విధించిరి. అమెరికావారు తమ ప్రతినిధులు లేని స్వాతంత్య ఇంగ్లీషు పార్లమెంటు వారికి తమ మీద పన్నులు వేయుటకు హక్కు లేడదని చెప్పిరి. పన్ను లిచ్చుటకు నిరాకరించిరి. ఏప్రజలమీద నై నను వారిచే నెన్ను కొనబడిన ప్రతినిధులే పన్నలు విధించు టకు హక్కుగలదు. గాని ప్రపంచములో మరియెవ్వరికిని హక్కు లేదని ఖండితముగా తెలిపిరి. ఇంగ్లీష- వారు. బలవంత ముగా పన్నులను వసూలు చేయుటకు యత్నించిరి. అమెరికా వారికిని ఇంగ్లీషు వారికిని యుద్ధము ప్రారంభ మయ్యెను. 1776వ సంవత్సరము జులై 4 వ తేదీన అమెరికా ప్రజలు స్వాతంత్య ప్రకటనటనముగావించిరి."అమెరికా సంయుక్త రాష్ట్రముల ప్రజలమైన మైన 'మేము భగవ దుద్దేశ్యమైనట్టియు, ప్రతిజాతికిని జన్మ హక్కయినట్టియు, స్వాతంత్యమును మా ప్రతినిధిసభ ద్వారా లోకమునకు ప్రకటించుచున్నారము, మాపక్షమున ధర్మము గలదని నమ్మి, ధర్మస్వరూపుడగు భగవంతునిసహాయము న పేక్షించుచున్నాము” అని ప్రచురించిరి. రాజుగానీ ప్రభువు లుగాని లేని సంపూర్ణ ప్రజాస్వామ్యము (రిపబ్లిక) ను స్థాపిం