పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
154

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

తగ్గించుటకు తుర్గో మంత్రి శేఖరుడు కొన్ని సంస్కరణములను ప్రారంభించెను. రిచ్లూమంత్రిని పదుమూడవ లూయి రాజును, కొల్బర్టుకు పదునాలుగవలూయిరాజును చేయూతనిచ్చి ప్రోత్సహించినట్లు తుర్గోమంత్రికి పదునారవలూయి రాజు సహాయపడిన చో బహుశః "ఫ్రెంచి విప్లవము కలుగకనే యుం డెడిది. కాని రాజు చుట్టును చెడు సలహాదారు లుండిరి. తుర్గో మంత్రి చేయు చుండిన మిత వ్యయమునకు రాణి కసమ్మతిగలి గెను. రాణి యొక్క విలాసములకు కోరిన ధనమియ్యనందున తుర్గో యం దామె కయిష్టము కలిగెను. బీదలను 'బాధించు చుండిన క ర్వి' అను పన్నును తీసి చేసి ప్రభువుల భూముల మీదకూడ పన్ను విధించపలెననియు రాజ్యములోని అందరి భూములను గొలిచి అన్ని భూముల నరి సమానముగ భూమి పన్ను విధించవ లెసనియు, తుర్లో మంత్రి యత్నించెను. మరియు రయితుల చేత బలవంతముగా ప్రభువులు పని చేయించ కూడదని ఉత్తర్వు చేసెను. కావున ఆయనకు వ్యతిరేక ముగ ప్రభువులు గొప్ప యాందోళనముచేసిరి. "ఈరోజున సామాన్య జనులతో పాటు మాభూములమీద పన్నులువేయు చున్నారు. రేపటి రోజున సామాన్య జనులతో పాటు రోడ్ల మీద కూలిపని చేయిం చెదరు" అని ప్రభువులు చెప్పిరి. కొన్ని వర్తక సంఘములకును కొందరు వర్తకులకునుగల ప్రత్యేక వర్తక పుహక్కులను తీసి వేసి తుర్గో మంత్రి దేశములో వర్తక స్వేచ్ఛను పరిశ్రమల స్వేచ్ఛను నెలకొలుప యత్నించెను. ఇది కూడదని ధనికు లగునట్టియు ప్రత్యేక హక్కుల ననుభవించుచున్నట్టియు వర్త