పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవ అధ్యాయము


యభిప్రాయ ప్రకారము దేశ ప్రభుత్వము సాగవలెను. ఎక్కు వమందియభిప్రాయుము ప్రకారము భిన్నాభిప్రాయమిచ్చిన తక్కు- వ మంది నడుచు కొనవలెను. ప్రభుత్వమునకును, ఏమతమున కుసు సంబందముండ గూడదు. ప్రజలు తమయిచ్చవచ్చిన ఏమ తమునయినను.ఆవలంబిం చుటకు సంపూర్ణ మగు స్వతంత్రత గలదు." అని ఆయన వ్రాసెను.


1762 వ సంవత్సరము మేనెలలో ఎమిలియను అనుగ్రం థము నాయన రచించెను. ఈమూడు గ్రంథ ములును పరాసుప్ర జలలో విశేషమగు దేశాభిమానమును పురిగొల్పి తీవ్రమకు స్వత ంత్రతభావములను కలుగజేసెను. అందరును ఈగ్రంథముల ను చదువుచుండిరి.. 1762 వ సంవత్సరము జూన్ నెలలో నీయన గ్రంథములను తగులబెట్టుటకును". ఈయనను ఖైదుచే యుటకును ఫ్రెంచి రాజుత్తరవు చేసెను. ఈయన పరాసు దేశ మువిడిచి భార్య తోకూడ పారి పోయెసు. యూరోపులో నే దేశమునకు పోయినను ఈయన ఖైదుచేయుమని ఆ ప్రభుత్వము నారుత్త రువిచ్చుచుం డిరి. నిలుచుటకు నీడ లేక ఎనిమిది సం వత్సరము లీయన ఒక దేశ మునుండి మరియొక దేశమునకు తిరిగెను. హాలెండు దేశములో నీ యన గ్రంథము లచ్చు పడి పరాసు దేశము లోనికి వేల కొలది దిగు మతియగుచుండెను, సమస్త జాతుల వారును ఆత్రుతతో చదువు చుండిరి. గ్రంథము లచ్చొత్తించువారు ధనమును సంపాదించు కొనిరి.దీనిని పరాసు ప్రభుత్వ ము వారాపజాలక పోయిరి. కొంత కాలమున కీయనకు ప్రష్యా రాజగు ఫెడరిక్" ది గ్రేటు తన రాజ్యములో నివసించుటకు అనుజ్ఞయిచ్చెను.ఫ్రెడరిక్ రాజు