పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

135

పదయవ ఆధ్యాయము


వాడు. ఇరువది యొక్క సంవత్సరముల వయస్సున పదునాలు గవలూయి రాజును వెక్కిరించుచు ప్రహసనము వ్రాసినాడని ఈయనను బాప్టిల్ కోటలో కొంత కాలము ఖైదు చేసిరి. ఈ యన తన కెప్పుడు ఆ పాయము కలుగు నని తోచిన నప్పుడు జర్మనీ లోనికి లేచి పోవుటకు వీలుగ నుండుటకై ఫ్రాన్సు యొక్క సరి హద్దున నున్న సిడ్నీ పట్టణమున నివసించెను.


ఈయన కవిత్వము, నాటకములు నవలలు, ప్రహ సనములు, వ్యాసములు, చరిత్రలు, తత్వ శాస్త్రము, రాజ కీయశాస్త్రము, ప్రకృతిశాస్త్రములు మొదలగు నన్ని విషయము లను గూర్చియు ససంఖ్యాక ములగు గ్రంథములు వ్రాసెను. ఏబది సంవత్సరముల కాలము ఎడతెగకుండ గ్రంధములు వ్రాయుట చే యూరపు ఖండమునందంతటను ప్రభువుల చేతను, ప్రజల చేతను, గౌరవాశ్చర్యములతో నీయన గ్రంథములు చదువబడు చుండెను. ఈయన వ్రాసినగ్రంధములు ఎనుబది .తొమ్మిది సంపుటములయ్యెను. సామాన్య జనులు చమవగలుగుటకై గంధములు చౌకగ నమ్మించెను. గ్రంధ విక్రయమువలన విశేష ధనమును సంపాదించెను. యూరపు లోని 'సెక్కు మంది రాజులును, ప్రభుపులుసు, రాజకీయ వేత్త లు నీయనకు స్నేహితులుగ నుండి. పరిపాలనలోను, శాసముల లోను, రాజ్యాంగవిధానములోను గల లోపములసు మిగుల కఠినముగ విమర్శించెను. సాంఘిక దోషములను, అసమానత్వ మును తీవ్రముగ ఖండించెను. నీతియు న్యాయను వర్థిల్ల వలె సనియు, మానవులకు సమానత్వమును స్వాతంత్రమును