పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి అధ్యాయము

'కాలమున 'గాలు దేశము' తూర్పుదిక్కున రైనునదివరకును అల్బ్సుపర్వతములపరకును వ్యాపించి ఇప్పటి ఫ్రాన్సుకన్న నయి 'దవవంతు పెద్దదిగ నుండెను. ఇటుతరువాత తూర్పున కొంత దేశమును ప్రాన్సు పోగొట్టుకొనినది. ఫ్రాన్సు దేశము తక్కిన యూరవుఖండములోని దేశములవలెనే సవీనముగ వృద్ధి జెంది సది. కాని హిందూ దేశము, ఈజిప్టు, చైనా, అరేబియా దేశ ములవలె ప్రాచీన నాగరిక తగలది కాదు. క్రీస్తుశక ప్రారంభమున హిందూదేశము ప్రపంచక ములో కెల్ల మిగుల నుత్కృష్టనుగు నాగరికతచే విరాజిల్లుచుం డెను. ఆ కాలమున “గాలు దేశము”న స్వల్పసొగరిక తగల నాలుగువందల జూతులు నివసించి యొకరి తో నొకరు కలహించుచుండిరి. పారి గురువులకు డ్రూయిడులని , పేరు. వారు తమ దేవతలకు సాధారణముగ నరబలు నిచ్చు చుండిరి. మతగురువుల సలహాతోడ రాజులు పాలించుచుండిరి. రాజుల కింద ప్రభువు లను జూతియుండెను. దేశ మంతఃకలహ ములకును రక్తపాతమునకు లోనై యుండెను. వ్యవసాయము కొంతవరకును, బట్టలు నేయుటయు, రంగులు వేయుటయు కొన్ని లోహములు వాడుటయు “ గాలు" దేశీయులకు తెలి యును. వ్రాత వాయుట తెలియదు. శత్రువులతో పోరాడి వారినోడించి పట్టుకొనినవుడు వారీ శిరములను ఖండించి యిం డ్లకు తీసికొనిపోవుదురు. గొప్పవాడైన శత్రువు యొక్క తల దొరికినచో దానిని నూనెలో వేసి దాచియుంచెదరు. "గాలు” లోని గొప్పవాడు మరణించినచో ఆతడు ప్రేమించిన జంతువు లను నౌకరులను ఆతనితో గూడ పాతి పెట్టెదరు. ప్రతివురుషు