పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/139

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

ఫ్రెంచి స్వాతంత్ర్య విజయము

ఒక్కొక్క విధమగు శాసనములుండెను. మనుష్యులను బట్టియు . జూతులను బట్టియు శిక్షలు వేయుచుండిరి .

ప్రజల దుస్థితి.

ప్రభువులలో గొప్ప వారు తమ 'మొఖాసాలను వదలి అందలి అయివజును తీసికొనిపోయి రాజమందిరము చుట్టు చేరి కేళీవిలాసములలో కాలముగడుపువారు రెండవరకమువారు తమ మొఖాసాలలోనే కొద్ది ఆదాయములతో కాలము గడుపువారు. మతగురువులలో మొదటి తరగతివారు మిగుల భాగ్యవంతులుగను, రెండవతరకము వారు బీదవారును నుండిరి. సామాన్యజను లలో రాజునకు ద్రవ్యమిచ్చి, వంశ పారంపర్యమగు మేజ స్ట్రీటు పదవులను కొనుక్కొనిన ఏబది వేలకుటుంబములు గలవు, వీరికి సంఘములో నెక్కువ గౌరవముగలదు. మధ్యమతరగతి ప్రజలు కాయకష్టము చేసి జీవించువారిని హేయముగజూచి . అందరికి అడుగున చెమట కార్చి కష్టించుచు, పై సంఘము యావత్తు యొక్క బరువు క్రిందబడి నలుగుచున్న వారి దారిద్ర్యములోసు అజ్ఞానములోను ముగియుండిరి. వీరందరి క్రిందను అడుగుస వ్యవసాయ బానిసలును, వారికన్న తక్కువగా ఎట్టి పౌరహక్కులును లేకుండ ప్రొటెస్టంటు మతస్థులును,, యూదులును ఉండిరి.

పన్నుల బాథలు.

ప్రభువులు "పెద్దయుద్యోగము లన్నిటిని వశ పరచుకొని యుండిరి. సైనికోద్యోగములన్నియు ప్రభువులకు మాత్రమే యియ్యబడెను. ప్రభువులే న్యాయాధిపతులుగ నుండిరి. ప్రభువులలో ఆస్తి పెద్ద కుమారునికి