పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

పదియవ అధ్యాయము

దుర్వ్యసనములలో చిక్కి దుర్వ్యయము చేయుచు విలాసము లలో కాలము గడువు స్త్రీ పురుషు లుండిరి. రాజమందిరము అవినీతి లోను కుట్రలోను మగ్నమై యుండెను. ప్రభుత్వమునకు ఋణములిచ్చువారు దొరకక నూటికి సంవత్సరమునకు ఇరువది చొప్పున వడ్డికి తాకట్టుల విూద రుణములు తెచ్చు' చుండిరి. ప్రభుత్వము వారు ప్రజలకు చేయు వాగ్దత్తముల నెప్పు డును చెల్లించకుండుట వలన ప్రజలకు ప్రభుత్వమందెట్టి విశ్వా సము లేకుండనుండెను. పదునేనవ లూయి ఒక్క సంవత్సరము లోపల తన యింద్రియ సౌఖ్యములకొకుకు పదునెనిమిటికోట్ల ద్రవ్యమును తీసికొనెను. కొన్ని పన్నులను పది సంవత్సరము లకు ముందుగానే తాకట్టు పెట్టెను. కొన్ని పన్నులు ప్రభుత్వ మువారు వసూలు చేయక ఇజారాకిచ్చుచుండిరి, ఇజాదార్లు ప్రజల యొద్ద ఎక్కువ వసూలు చేసికొని కొంత మాత్రమే ప్రభు త్వమున కిచ్చుచుండిరి. ఇజా రాదాన్లు గొప్ప యద్యోగస్థులకు లంచమిచ్చి తక్కువ ఇజారాకు పుచ్చుకొనుచుండిరి. పన్నులు బాకీ యున్న వారిని ఖయిదులలో సుంచు చుండిరి. ప్రభుత్వఆదా యములో చాలభాగము వృథాగా పటాలముల క్రింద ఖర్చు అగుచుండెను. అనవసరముగ పటాలములను రాజు పెట్టుకొని యుండెను. రాజు చిత్తము వచ్చినటుల పన్నులను వృద్ధి చేసెను. ఏమనుష్యు నియొక్కయు ప్రాణమునకును, ఆస్తికిని, స్వేచ్ఛకును ప్రభుత్వము యొక్క నిరంకుశత్వము నుండి సురక్షితము లేదు. ఎవరి నెట్టి నిర్బంధములకు లోను జేసినను అడుగువారు లేరు. చట్టములు , సమానముగ లేవు. ఒక్కొక్క ప్రదేశములో