పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/13

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
2.

ప్రెంచి స్వాతంత్ర్య విజయము

యు, రంగువలనగాని, కులమువలసగాని, ధనమువలని గాని, వృత్తివలన గాని, మతమువలన గాని ఎవరును తక్కినవారికన్న, నధికులు కాజూలరనియు, సమర్థత, యోగ్యతలు మాత్రమే గౌరవార్హమయినవనీయు నను భావము మూడవది. నూట ఏబది యేండ్ల కిందట ప్రపంచము నిరంకుశత్వములోను స్వార్థ పరత్వములోను, మతదుస్సహసములోను మగ్నమై యుండిన పుడు ఫ్రాన్సు దేశము పైమూడు భావములను లోకమునకు ప్రసాదించి వాని స్థాపనకొరకై గొప్ప త్యాగములు చేసినది . ప్రాస్సు దేశమునుండియే ఈ భావములు ఇతర దేశములకు వ్యా పించి యిపుడు మానవకోటిని ఉద్రేకించుచున్న ప్రథాసభావ ములుగ నిలచినవి. ప్రయత్నములు చేయుటలోను, కార్యా చరణలో 'బెట్టుటలోను పరాసు దేశీ యు లనేక పొర బాటులు, తప్పులు చేసిరనుట నిర్వివాదాంశము. వానిని సవరించుకొను టకు గూడ ప్రయత్నించిరి. తప్పులు చేసినపుడు . సత్రములను, సవరించుకొనినపుడు అభివృద్ధిని, సౌఖ్య మును పొంది. ఉదార భావములచే ప్రేరేపింపబడి, కష్టపరంపర లను 'ధైర్యముతో నెదుర్కొని, మహత్కార్యములను సాధించినయొక జాతి యొక్క అనుభవము లిందు కొంతవరకు విశదపరచబడినవి.

గాలు దేశము,

ఫ్రాన్సు దేశ మునకు పూర్వకాలము 'గాలు దేశ, మని పేరుండెను. పశ్చిమము నను ఉత్తరము నను అట్లాంటికు మహాసముద్రము, దక్షిణ మున మధ్యధరా సముద్రము, నైరుతిమూల పెరినీసు కొండలు, ఇవి ఫ్రాన్సు దేశమునకు నైసర్గికమగు ఎల్లలు. పూర్వ