పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
115

ప్రెంచి స్వాతంత్ర్య విజయము

ఈయసయుంపుడుకత్తెయగు ప్రీయువతికి, ఆంగ్లేయ ప్రభుత్వ మువారు ఆబిడ్యూబాయి కిచ్చుచుండిన *[1]లంచము నే ఇచ్చు చుండిరి. ఫ్రాన్సు ప్రభుత్వము ఇంగ్లాడుతో సఖ్యముగా నుం డెను.

పోలండు.

1726 మొదలు 1743 వరకును ఫ్లూరి యను ముసలి మతగురువు రాజుయొక్క ప్రధానమంత్రి యయ్యెను. ఇతడు విశేషసమర్థుడు గాకపోయినను యోగ్యుడు, రాజు సమస్తమును మంత్రికి వదలి స్త్రీలోలుడై మెలంగుచుండెను. రాజు యొక్క మామగారగు స్టానిస్లాసు పోలండు రాజ్యమునకు హక్కు దారుడయ్యెను. నాక్సనీ ప్రభువు పోలండు రాజ్యము తనకు రావ లెన నెను. ఆస్ట్రియా రుష్యాలు సౌక్సనీ పక్షమునను , ఫ్రాన్సు, స్పెయిన్, సావాయి ప్రభుత్వములు స్ట్రానిస్లాసు పక్షమునను నేరి యుద్ధము సలిపిరి. ఫ్రెంచిపక్షము విజయము గాంచెను. కొంత దేశము స్టానిస్లాసున కిప్పించి సంధి చేసికొనిరి. ఈ యుద్ధము వలన ఫ్రాన్సు ఇంకను యూరోవులో కెల్ల జలవంతమయినదని తేలేను..

ఆస్ట్రియా
యుద్ధము

ఆస్ట్రియాచక్రవర్తి యగు అరవచార్లెసు 1740 వ సం వత్సరమున మరణించెను. తన రాజ్యమంతయు తన కుమార్తె యగు మేరియా థెరీజాకు సంక్రమించవలెనని శాసనముచేసెను. కాని ఆయన మరణించగానే ఆస్ట్రియా సామ్రాజ్యమునకు అయిదుగురు హక్కుదాగులు బయలు దేరిరి. యూరపు రాజుల మధ్య గొప్ప యుద్ధము జరిగెను.

...........................................................................

  1. * డ్యూరి యొక్క ఫ్రాన్సు చరిత్రను చూడుడు,