పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112


తొమ్మిదవ అధ్యాయము

ముల కెల్ల ఖనియని చెప్పదగిన ఆబిడ్యూ బాయిచేతిలో పూర్తిగనుండెను. ఆ బిడ్యూబాయి విదేశ రాజ్యాంగమంత్రిగ నుండెను. ఇంగ్లాండుతో సఖ్యముగ నుండి ఇంగ్లాండుకు లాభ కరముగ ,బనిచేయుటకు ప్రతి సంవత్సరమును *[1]ఆంగ్లేయ ప్రభు త్వమువారు అబిడ్యూబాయికి ఏబది వేలు మొదలు పదిలక్షల వరకు క్రౌనులను లంచమిచ్చు చుండిరి. తనకు సముహముల మీద పోటీగ నున్న స్పెయినుతో - ఇంగ్లాండు యుద్ధము చేయు టలో ఫ్రాన్సు దేశము స్పెయిస్ తోడ చేరక ఇంగ్లాండు పక్షమున చేరుటకీ లంచము నిశ్చిను. ఫాస్సు ప్రభుత్వము ఇంగ్లాండు పక్షమున -చేరెను. స్పెయిను ఓడిపోయెను. సముద్రముల మీద ఇంగ్లాండునకు మంచి బమేర్పడెను. ఈసముద్రముల మీద బలమువలననే ఇంగ్లాండు ముందుముందు ఫ్రాన్సును అణగగొట్టనున్నది. అర్లియస్సు ప్రభువును అబిడ్యూయ బాయి యు, రోమనుకాదలిక్కు మతగురువులను సంతోషపరచుట ప్రొటెస్టెంటులను వి శేషముగ నిర్బంధములకు లోబడ జేసిరి.

బోస్బోన్
ప్రభువు

పదుమూడవ యేటనే ఫొస్సు రాజులకు మైనార్జి వెళ్లును గావున పదమూడవయేట పదు నేనప లూయి రాజ్యభారమును వహించెను. అర్లియన్సు ప్రభువును ఆబిడ్యూ బాయియు మరణించిరి.మూడు సంవత్సరములకా లము బోర్బోన్ ప్రభువు ప్రధానమంత్రిగా రాజ్యమును పాలిచె సు. ఈయనయు అవినీతిలోను దుర్వ్యియములోను ప్రొసెస్టెంటు లను నొ త్తిడి చేయుటలోను ఆర్లియన్సు ప్రభువును మించెను.

..................................................................................

  1. * డ్యూరియోక్క ఫ్రాశ్సు చరిత్ర మాసు జూడుము.