పుట:Frenchi-Svaatantrya-Vijayamu.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

115

ఎనిమిదవ అధ్యాయము

లూయీరాజు తనక్రింది ప్రభువులుసు సామంతు రాజులును తన చుట్టును చేరి తన్ను స్తోత్ర పాఠములు చేయుచు తనతో పాటు విలా సములలోను కీడలలోను నింద్రియ వ్యవసముల లోను రాజమం దిరములో కాలము గడవునటులు చేసెను. రాజునకు దూరము గసున్న పలువును ఏదో పేరు పెట్టి రాజు శిక్షించెను. రాజు చుట్టు చేరిన ప్రభువులకు బిరుదములిచ్చి సంతోషపర చెమె. ప్రభువులు తమ భూములమీదవచ్చు. ఐవజును "చ్చుకొని రాజు సమ్ముఖ మున ఖర్చు చేసికొని ఋణ స్తులైరి. రాజు మునిసిపాలిటీల హ క్కులను తగ్గించెను. వర్తకులు ప్రతివిషయమునను రాజు మీద ఆధారపడునట్లు చేసెను. సామాన్య ప్రజలు ప్రభువుల మొ త్తిడిసుం డి సంరక్షణకొరకు రాజు మీదనే ఆధారపడిరి. రోమను కాథలిక్కు మతగురువులు, రాజు రాజ్య వ్యవహారముల కేగాక మతమునకు గూడ దైవాంశ సంభూతుడగు నిరంకుశ ప్రభువని తీర్మానించిరి. ఇందుకు ప్రతిఫలముగ రాజు ప్రొటెస్టెటు మతావలంబులను ఘోరశిక్షలపాలు చేసి రోమను కాథలిక్కు మతగురువులను సంతోష పెట్టెను. ఈ విధమున సమస్త విషయములలోను రాజు నిరంకుశు డయ్యెను. పదునాలుగవ లూయీ యొక్క.అనుగ్రహ ముసుకోరి జయజయధ్వనులు చేయుచు అన్ని జాతుల ప్రజలు మెలఁగిరి ఆయన యొక్క పరిపాలనా సామర్ధ్యము యుద్ధజయ ములు, వైదుష్యము, పేరు ప్రతిష్టలు—యివి ఆయన యొక్క యింద్రియ లోలతను, దుర్వ్యయముసు, ఆర్థిక దుస్థితిని, నిరంకు శత్వమును తాత్కాలికముగా కప్పిపుచ్చినవి. అతని వార సుల కాలమున ఈ లోపములన్నియు బయటపడి సవి.